ఎల్లమ్మ కోసం మైసూరులో !
ఇదిలా ఉంటే ఇప్పుడు ఎల్లమ్మకు సంబంధించి ఓ అప్డేట్ నెట్టింట వినిపిస్తుంది.;

టాలీవుడ్ లో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న వేణు యెల్దండి ఉన్నట్టుండి బలగం సినిమాతో డైరెక్టర్ గా మారి అందరికీ షాకిచ్చాడు. వేణు డైరెక్టర్ అవడమే షాకైతే, ఎవరూ ఊహించని సెన్సిటివ్ కంటెంట్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం మరో షాక్. మొదటి సినిమాతోనే వేణు డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. అందుకే వేణుని దిల్ రాజు వదలడం లేదు.
వేణు చేయబోయే రెండో సినిమాను దిల్ రాజు బ్యానర్లోనే చేయనున్నాడు. అయితే బలగం తర్వాత వేణు తన తర్వాతి సినిమాకు చాలానే గ్యాప్ తీసుకున్నాడు. దానికి కారణం రెండో సినిమాను ఎలాగైనా కొంచెం ఫేమ్ ఉన్న హీరోతో చేయాలనుకోవడమే. అందులో భాగంగానే ఎల్లమ్మ కథను నానికి చెప్పాడు వేణు. కానీ నాని ఆ కథపై పూర్తి సంతృప్తిగా లేకపోవడంతో ఎల్లమ్మ ముందుకెళ్లలేదు.
దీంతో అదే కథను నితిన్ కు చెప్పి ఒప్పించాడు వేణు. ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో తమ్ముడు సినిమా చేస్తున్ననితిన్, ఎల్లమ్మ కథను దిల్ రాజు బ్యానర్లో అనగానే ఓకే చెప్పేశాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఎల్లమ్మకు సంబంధించి ఓ అప్డేట్ నెట్టింట వినిపిస్తుంది. ప్రస్తుతం ఎల్లమ్మ కోసం మైసూరులో లొకేషన్స్ ను వెతుకుతున్నాడట వేణు.
అంతేకాదు బలగం సినిమాటోగ్రాఫర్ ఆచార్య వేణుని ఎల్లమ్మ కోసం రిపీట్ చేస్తున్నాడని తెలుస్తోంది. పీరియడ్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాలో తెలంగాణ ఆచారాలు, దేవతల గురించి చెప్పనున్నాడట డైరెక్టర్ వేణు. ఇప్పటికే ఎల్లమ్మ కోసం స్టేజ్ ఆర్టిస్టులను ఎంపిక చేసిన వేణు ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ ను ఫిక్స్ చేశాడు. మొత్తానికి వేణు ఎల్లమ్మ కోసం చాలా బ్యాక్ గ్రౌండ్ వర్కే చేస్తున్నాడని అర్థమవుతుంది. మే- జూన్ నుంచి ఎల్లమ్మ సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది. రీసెంట్ గా రాబిన్‌హుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నితిన్, ప్రస్తుతం తమ్ముడు సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. ఆ సినిమా రిలీజైన వెంటనే ఎల్లమ్మ సెట్స్ పైకి వెళ్లనుంది.