బిగ్‌బాస్‌ 8 : జాతకాలు చెప్పే స్వామికి ఎంట్రీ..?

తెలుగు బిగ్‌ బాస్‌ ప్రేక్షకులు సీజన్‌ 8 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Update: 2024-07-05 09:17 GMT

తెలుగు బిగ్‌ బాస్‌ ప్రేక్షకులు సీజన్‌ 8 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీజన్‌ 7 భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సీజన్‌ 8 ని మరింత గ్రాండ్ గా నిర్వహించేందుకు నిర్వాహకులు ప్లాన్‌ చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న వారికి ఈసారి కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబోతున్నారు.

సినిమాలు మరియు సిరీయల్స్ లో నటించిన వారితో పాటు సోషల్‌ మీడియా సెలబ్రిటీలను మరియు వివాదాస్పద వ్యక్తులను బిగ్‌ బాస్ లోకి తీసుకోవడం ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించవచ్చు అనేది షో నిర్వాహకుల ప్రయత్నంగా తెలుస్తోంది. సెప్టెంబర్‌ లో ప్రారంభం కాబోతున్న బిగ్‌ బాస్ 8 లో వేణు స్వామి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

తెలుగు టీవీ మరియు సోషల్ మీడియా ఫాలోవర్స్ కి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జాతకాలు చెప్పడం, రాజకీయ నాయకులకు సంబంధించిన గెలుపు ఓటముల గురించి అంచనా వేయడం వంటి కారణాల వల్ల వేణు స్వామి కూడా సెలబ్రిటీ అయ్యాడు.

ఇటీవల తాను వేసిన అంచనా తప్పడంతో ఇక ముందు రాజకీయాల గురించి అంచనా వేయడం కానీ, రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను కానీ చూడబోను అన్నట్లుగా ప్రకటించాడు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అయిన వేణు స్వామి బిగ్‌ బాస్ లో ఉంటే బాగుంటుందని నిర్వాహకులు భావించారట.

ఆయన్ను సంప్రదించిన వెంటనే ఓకే అనేశాడని సమాచారం అందుతోంది. బిగ్‌ బాస్ లోకి వెళ్లేంత ఖాళీగా ఆయన ఉన్నాడా అని కొందరు భావిస్తున్నారు. అయితే ఆయనకు మరింతగా పబ్లిసిటీ దక్కడంతో పాటు ముందు ముందు ఆయన వద్దకు జాతకాల కోసం మరింత మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఆయన బిగ్‌ బాస్ కి ఓకే చెప్పి ఉంటాడు.

Tags:    

Similar News

eac