వీడియో: ట్రిప్తీ -మ‌ల్లిక శెరావ‌త్‌ స్పెష‌ల్ ట్రీట్

అంత‌గా ప్ర‌భావితం చేసిన ఈ బ్యూటీ స‌డెన్ గా సినిమాలు వ‌దిలి త‌న విదేశీ స్నేహితుడితో ఫారిన్ కి వెళ్లిపోయింది.

Update: 2024-09-12 18:01 GMT

మల్లికా షెరావత్ పేరు విన‌గానే మ‌ర్డ‌ర్ సినిమా గుర్తుకు వ‌స్తుంది. ఆ సినిమాలో ఇమ్రాన్ హ‌ష్మీతో మ‌ల్లిక‌ ఘాటైన రొమాన్స్ లిప్ లాక్ ల‌ను యూత్ రివైండ్ చేస్తుంది. హిస్ చిత్రంలో స‌ర్ప‌క‌న్య‌గాను న‌టించి మెప్పించింది. మల్లికా శెరావ‌త్ నా ఫేవ‌రెట్ స్టార్ అంటూ అల్ల‌రి న‌రేష్ బ‌హిరంగంగా ప్ర‌క‌టించాడు. అంత‌గా ప్ర‌భావితం చేసిన ఈ బ్యూటీ స‌డెన్ గా సినిమాలు వ‌దిలి త‌న విదేశీ స్నేహితుడితో ఫారిన్ కి వెళ్లిపోయింది.

అయితే అత‌డితో బ్రేకప్ అయ్యాక తిరిగి ముంబైకి వ‌చ్చేసిన మ‌లైకా, ఇక్క‌డ వ‌రుస‌గా సినిమాల్లో న‌టించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఇప్పుడు సుదీర్ఘ విరామం తర్వాత విక్కీ విద్యా కా వో వాలా వీడియోతో పెద్ద తెరపై కనిపించబోతోంది మ‌ల్లిక‌. దీనికి సంబంధించిన ట్రైలర్ ఈరోజు విడుదలైంది. ట్రైల‌ర్ ఆద్యంతం రాజ్ కుమార్ రావు- యానిమ‌ల్ బ్యూటీ ట్రిప్తి దిమ్రీ న‌డుమ ఫ‌న్, రొమాన్స్ కి సంబంధించిన స‌న్నివేశాలు అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి. ట్రిప్తీతో రొమాన్స్ లో రాజ్ కుమార్ రావు స‌మ‌స్య ఏమిట‌న్న‌ది క‌డుపుబ్బా న‌వ్విస్తోంది. అలాగే మ‌ల్లిక ఎంట్రీ సీన్.. ఇత‌ర న‌టీన‌టుల ఫ‌న్ యాంగిల్ ఇందులో ప్ర‌ధానంగా హైలైట్ అయ్యాయి. ప్ర‌స్తుతం ట్రైల‌ర్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.

అంత‌ర్జాలంలో దావాన‌లం

ప్ర‌స్తుతం మ‌ల్లిక ఫోటోలు, వీడియో బిట్స్ ఇంటర్నెట్‌లో దావానంలా వైరల్‌గా మారాయి. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో దర్శకుడు రాజ్ శాండిల్య మల్లికాను కామెడీ చిత్రంలో ఎందుకు తీసుకున్నారనే దానిపై మాట్లాడుతూ.. అసలు కారణాన్ని వెల్లడించారు. ఆ పాత్ర‌కు స‌రిపోయింది కాబ‌ట్టే ఎంపిక ఏసుకున్నామ‌ని తెలిపారు. నిర్మాత భూషణ్ కుమార్ ట్రైల‌ర్ ఈవెంట్లో మాట్లాడుతూ..మల్లికా షెరావత్‌ను తిరిగి తీసుకురావాలని మేం అనుకున్నాం. ఎందుకంటే ఆమె ఈ రకమైన నిర్దిష్ట పాత్రను చాలా కాలంగా చేయలేదు అని అన్నారు.

`విక్కీ విద్యా కా వో వాలా` వీడియోలో ట్రిప్తీ డిమ్రీ, విజయ్ రాజ్, మస్త్ అలీ, అర్చన పురాణ్ సింగ్, ముఖేష్ తివారీ, సహర్ష్ కుమార్ శుక్లా, అర్చన పటేల్, రాకేష్ బేడి, టికు తల్సానియా, అశ్విని కల్సేకర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ కార్యక్రమంలో భూషణ్ కుమార్ కూడా రాజ్‌కుమార్ రావును ప్రశంసించారు. అతడిని అద్భుతమైన నటుడు అని అన్నారు. కామెడీ అయినా.. నిజ జీవిత కథ అయినా అతడు ప్రతి పాత్రను చాలా బాగా పోషిస్తాడు. నేను సెట్‌కి వెళ్లినప్పుడు సినిమాలో ఎలాంటి క్యారెక్టర్‌ని చూపించాడో అని వ్యాఖ్యానించారు. అనుభవజ్ఞుడైన నిర్మాత నటీనటులంతా స‌రైన‌ సహకారం అందించినందుకు ప్రశంసించారు. విక్కీ విద్యా కా వో వాలా వీడియో 11 అక్టోబర్ 2024న థియేటర్లలోకి వస్తుంది.

Full View
Tags:    

Similar News