అక్టోబ‌ర్ 11 ఫైట్: ఇద్ద‌రూ జోరుమీదున్నారు!

అక్టోబ‌ర్ 11న ఆలియా న‌టించిన జిగ్రాతో, రాజ్ కుమార్ రావు- ట్రిప్తీ దిమ్రీ న‌టించిన‌ `విక్కీ విద్యా కా వో వాలా` పోటీకి సిద్ధ‌మ‌వుతోంది.

Update: 2024-09-19 03:24 GMT

అక్టోబ‌ర్ 11న ఆలియా న‌టించిన జిగ్రాతో, రాజ్ కుమార్ రావు- ట్రిప్తీ దిమ్రీ న‌టించిన‌ `విక్కీ విద్యా కా వో వాలా` పోటీకి సిద్ధ‌మ‌వుతోంది. `జిగ్రా` యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చిత్రంగా అల‌రించ‌నుండ‌గా, విక్కీ విద్యా.. కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ జాన‌ర్ లో అల‌రించ‌నుంది. జిగ్రాను వాసన్ బాలా దర్శకత్వంలో ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించింది. అంత పెద్ద బ్యాన‌ర్ నుంచి వ‌స్తోంది గ‌నుక జిగ్రాకు ప్ర‌మోష‌న్స్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు.

అయితే రేసులో రాజ్ కుమ‌ర్ రావు- ట్రిప్తి దిమ్రీ న‌టించిన విక్కీ విద్యా కో వాలా ఉంద‌నేది మ‌రువ కూడ‌దు. ఇది చిన్న సినిమాలా క‌నిపించినా కానీ స్త్రీ 2తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న రాజ్ కుమార్ రావు మ‌రోసారి బాక్సాఫీస్ వ‌ద్ద‌ ఊపు తేగ‌ల స‌మ‌ర్థుడు అన్న‌ది గ్ర‌హించాలి. పైగా ఇందులో యానిమ‌ల్ ఫేం ట్రిప్తి దిమ్రీ కూడా ఉంది. ప్ర‌స్తుతం ఇరు చిత్రాల‌కు ప్ర‌చారం బాగానే ఉంది. కానీ ఎవ‌రికి వారు త‌మ సినిమా హిట్ట‌వుతుందంటే త‌మ సినిమా హిట్ట‌వుతుంద‌ని న‌మ్మ‌కంగా ఉన్నారు.

రాజ్ శాండిల్య లాంటి స్టార్ రైట‌ర్ నుంచి వ‌చ్చిన స్క్రిప్టు గ‌నుక రాజ్ కుమార్ రావు విక్కీ విద్యా... సినిమాకి అంగీక‌రించారు. ఈ త‌ర‌హా కామెడీ చిత్రాలకు మాస్ లో ప్రత్యేక ఆకర్షణ ఉంది. విక్కీ విద్యా కా వో వాలా వీడియో ట్రైలర్ అంతంత మాత్రంగానే ఉన్నా కానీ ఈ సినిమాని త‌క్కువ అంచ‌నా వేయ‌డానికి లేదు. కంటెంట్ ప‌రంగా ఇది ఇత‌ర సినిమాల‌ను రేసులో నెగ్గే ఛాన్సుంటుంద‌ని అంచ‌నా. మ‌రోవైపు ఆలియా జిగ్రా పోస్ట‌ర్లు అంత‌కంత‌కు క్యూరియాసిటీని పెంచుతున్నాయి. అదే క్ర‌మంలో ఈ రెండు సినిమాలు పోటీపోటీగా బ‌రిలో దిగుతుండ‌డం ఉత్కంఠ పెంచుతోంది. చివ‌రికి ఎవ‌రి సినిమాలో కథా బ‌లం ఉంది? స్క్రిప్టు ఏది బెస్ట్ అనేవే విజ‌యాల‌ను నిర్ధేషిస్తాయి.

Tags:    

Similar News