ప్రపంచ సుందరిగా డెన్మార్క్ భామ... ప్రత్యేకతలివే!
తాజాగా జరిగిన ప్రపంచ అందాల పోటీల్లో డెన్మార్క్ కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ గెలుపొందారు.
విశ్వసుందరి... అందాల పోటీల్లోకి అడుగుపెట్టే భామల జీవితాశయం! ఒక్కసారి ఈ కిరీటాన్ని ధరిస్తే చాలు.. వారి అందం ప్రపంచ వేదికపై సాక్ష్యాత్కరించబడుతుంది! ఇక్కడ కేవలం శారీరక సౌందర్యం మాత్రమే ప్రాతిపదిక కాదు.. ఎన్నో ఇంకెన్నో కోణాల్లో ఈ అర్హత దక్కుతుంది! ఈ సమయంలో తాజాగా డెనార్క్ యువతి ఈ కిరాటాన్ని అందుకున్నారు.
అవును... తాజాగా జరిగిన ప్రపంచ అందాల పోటీల్లో డెన్మార్క్ కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ గెలుపొందారు.. ఆమెను విశ్వసుందరి కిరీటం వరించింది. మెక్సికో వేదికగా జరిగిన ఈ పోటీల్లో 125 మంది పోటీ పడగా.. విక్టోరియా కెజర్ 21 ఏళ్ల వయసులో ఇది సొంతం చేసుకున్నారు. ఆమె ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉన్నారు.
ఈ పోటీల్లో విక్టోరియా విన్నర్ గా నిలవగా.. నైజీరియాకు చెందిన చిడిమ్మ అడెట్షినా మొదటి రన్నరప్ గా.. మెక్సికోకు చెందిన మరియా ఫెర్నాండా బెల్ ట్రాన్ రెండో రన్నరప్ గా నిలిచారు. ఈ మేరకు 2023 మిస్ యూనివర్స్ షెన్నీస్ పలాసియోస్.. తాజా విజేత విక్టోరియాకు కిరీటాన్ని అందజేశారు.
ఇక ఈ పోటీల్లో భారత్ తరుపున రియా సింఘా పాల్గొనగా.. ఆమె టాప్ 5లోనూ నిలవలేకపోయారు. ఈ సందర్భంగా స్పందించిన మిస్ యూనివర్స్ 2024 టీమ్... 73వ విశ్వ సుందరిగా గెలుపొందినందుకు విక్టోరియాకు అభినందనలు తెలిపింది. ఈ సందర్భంగా కొత్త శకం ఆరంభమైందని పేర్కొంది.
ఇదే సమయంలో ఈమె ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో స్ఫూర్తి నింపేలా సాగాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. కాగా... విశ్వసుందరి కిరీటం ఇప్పటి వరకూ డెన్మార్ కు దక్కలేదు. తాజాగా విక్టోరియా రూపంలో ఆ దేశానికి ఈ కిరీటం దక్కింది.
ఇక.. సోబోర్గ్ లో 2004లో జన్మించిన విక్టోరియా... బిజినెస్ అండ్ మార్కెటింగ్ లో డిగ్రీ పొందారు. వ్యాపారవేత్తగా మారడంతో పాటు డ్యాన్స్ లోనూ శిక్షణ తీసుకున్నారు. ఇదే క్రమంలో... మూగ జీవాల సంరక్షణపై పోరాటం చేస్తున్నారు.