విక్టరీపై విపరీతమైన బజ్!
ఈ నేపథ్యంలో 300 కోట్ల వసూళ్ల సినిమా వెంకటేష్ కెరీర్ నే కొత్త పుంతలు తొక్కిస్తుంది. సీనియర్ హీరోల్లో వెంకటేష్ మాత్రమే ముందంజలో ఉన్నారు.
`సంక్రాంతికి వస్తున్నాం` రిలీజ్ తో విక్టరీ వెంకటేష్ కెరీర్ లో తొలి సెంచరీ నమోదైంది. ఈ సినిమా ఏకంగా బాక్సాఫీస్ వద్ద వెంకీని 300 కోట్ల క్లబ్లో కూర్చబెట్టింది. దీంతో వెంకటేష్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ఆయన ఇమేజ్ రెట్టింపు అయింది. దీంతో వెంకటేష్ తదుపరి సినిమా ఏంటి? అన్న చర్చ మొదలైంది. సాధారణంగా ఇలాంటి చర్చ వెంకీపై ఎప్పుడూ లేదు. సినిమాలు చేస్తున్నారు..రిలీజ్ అవుతున్నాయి.
వెళ్తున్నాయి అనే మాట తప్ప! ప్రత్యేకించి వెంకటేష్ వాట్ నెక్స్ట్ అన్న చర్చ ఎప్పుడూ జరగలేదు. ఈ నేపథ్యంలో 300 కోట్ల వసూళ్ల సినిమా వెంకటేష్ కెరీర్ నే కొత్త పుంతలు తొక్కిస్తుంది. సీనియర్ హీరోల్లో వెంకటేష్ మాత్రమే ముందంజలో ఉన్నారు. ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి కూడా వెనుకబడే ఉన్నారు. ఇక మిగతా ఇద్దరు సీనియర్లు బాలయ్య, నాగార్జునల గురించి చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి `సైరా నరసింహారెడ్డి` సినిమా 250 కోట్ల వసూళ్లనే సాధించింది.
అంతకు ముందు ..ఆ తర్వాత రిలీజ్ అయిన చిత్రాల వసూళ్లు 200 కోట్ల లోపే ఉంటాయి. ఆ రకంగా చూసుకుంటే వెంకటేష్ ఆ ముగ్గురు కంటే మెరుగైన స్థానంలో ఉన్నట్లే. ఈ నేపథ్యంలోనే వెంకటేష్ తదుపరి సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇంత వరకూ ఆయన కొత్త సినిమాకి కమిట్ అవ్వలేదు. దీంతో ఇప్పుడాయన ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు? అన్నది ఆసక్తికరకంగా మారింది. ఇప్పుడు ఏ డైరెక్టర్ సినిమా చేసినా వెంకీ సాధించిన 300 కోట్ల వసూళ్లను దృష్టిలో పెట్టుకుని సినిమా తీయాలి.
అదీ రీజనల్ మార్కెట్ ని బేస్ చేసుకుని తీయాలి. `సంక్రాంతి వస్తున్నాం` పాన్ ఇండియా రిలీజ్ కాదు. కేవలం తెలుగు మార్కెట్లోనే 300 కోట్లు రాబట్టింది. అంటే తదుపరి చిత్రం అంతకు మించి ఉండేలా వెంకీ ప్లాన్ చేయాలి. మరి 2025 లో ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తారో చూడాలి.