విడాముయర్చి టీజర్.. థ్రిల్లింగ్ అన్వేషణ…
కోలీవుడ్ స్టార్ అజిత్ హీరోగా మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘విడాముయర్చి’. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించింది.
కోలీవుడ్ స్టార్ అజిత్ హీరోగా మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘విడాముయర్చి’. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈ సినిమాలో అజిత్ కి జోడీగా త్రిష నటించింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ టీజర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొని వచ్చారు. ఈ మూవీ స్టోరీ కంప్లీట్ గా అరబిక్ కంట్రీస్ లో తెరకెక్కించినట్లు టీజర్ చూస్తుంటే అనిపిస్తుంది. ఇక టీజర్ ఆరంభంలో ఎవరినో మూటకట్టి కారులో తీసుకొచ్చి పారేసి షూట్ చేసి చంపినట్లు చూపించారు.
వెంటనే యాక్షన్ కింగ్ అర్జున్ ని రివీల్ చేశారు. తరువాత హీరో అజిత్, త్రిష లవ్ ఎపిసోడ్ ని ప్రెజెంట్ చేశారు. ఆపై అజిత్ ఎవరికోసమో వెతుకుతున్నట్లు టీజర్ లో ప్రెజెంట్ చేశారు. ఈ వెతికే క్రమంలో అతనికి ఎదురయ్యే సవాళ్లు అన్ని కనిపిస్తున్నాయి. కంటెంట్ చూస్తుంటే థ్రిల్లర్ యాక్షన్ జోనర్ లో ఉన్నట్లు అనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో అజిత్ రెగ్యులర్ కమర్షియల్ జోనర్ నుంచి బయటకొచ్చి మూవీస్ చేస్తున్నాడు.
‘విడాముయర్చి’ కథ కూడా అలాగే ఉన్నట్లు కనిపిస్తోంది. మాగిజ్ తిరుమేని ఏదో ఆసక్తికరమైన అంశంతో ఈ మూవీని తెరకెక్కించినట్లు అర్ధమవుతోంది. అయితే అజిత్ ఫ్యాన్స్ ఎక్కువగా యాక్షన్ ఎపిసోడ్స్ కోరుకుంటారు. టీజర్ లో ఎక్కువగా సెర్చింగ్ కనిపిస్తోంది. యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్న కూడావాటిని మించి డ్రామా ఈ మూవీలో ఉండబోతోందని టీజర్ లో కనిపిస్తోంది.
అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని పొంగల్ కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాబోతున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చేసారు. అంటే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నట్లే. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయిపొయింది. ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని తమిళ్, తెలుగు భాషలలో సంక్రాంతికి తీసుకొని రావాలని అనుకున్నారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఇంతలో లైకా ప్రొడక్షన్స్ విడాముయర్చి రిలీజ్ సంక్రాంతికి ఉంటుందని టీజర్ తో కన్ఫర్మ్ చేసేసారు. ఈ మూవీ రిలీజ్ అవుతూ ఉండటంతో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే లాస్ట్ మినిట్ లో ఏమైనా ఈ రెండు సినిమాల రిలీజ్ ప్లాన్ చేంజ్ అవుతుందా అనేది వేచి చూడాలి.