ఆయన వెనక్కి తగ్గితే చరణ్ చెలరేగిపోయేలా!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `గేమ్ ఛేంజర్` సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `గేమ్ ఛేంజర్` సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈసారి దేశమంతా ప్రచారం చేయబోతున్నారు. ఈసినిమాపై అంచనాలు ఇప్పటికే పీక్స్ చేరాయి. ముఖ్యంగా ఈ సినిమా సక్సెస్ శంకర్ కి అత్యంత కీలకమైంది. ఈ హిట్ తో తనపై కోలీవుడ్ లో తనపై ఉన్న విమర్శలన్నింటికి చెక్ పెట్టాలని ఎంతో ప్రీ ప్లాన్డ్ గా రంగంలోకి దిగి చేసిన ప్రాజెక్ట్ ఇది.
అలాగే రామ్ చరణ్ కూడా రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేయాలి. తొలి సోలో పాన్ ఇండియా సక్సెస్ గా గేమ్ ఛేంజర్ నిలవాలి. ఇలా ఎవరిపై ఉండాల్సిన ఒత్తిళ్లు వారిపై ఉన్నాయి. రీజనల్ సహా హిందీ మార్కెట్ వరకూ పర్వాలేదు. కానీ కోలీవుడ్ కి వచ్చే సరికే తెలుగు సినిమాలకు సరైన ఆదరణ దక్కలేదు. అయితే ఈసారి శంకర్ తెరకెక్కించిన చిత్రం కాబట్టి అక్కడ ప్రేక్షకులు సైతం ఎంతో ఎగ్జైట్ మెంట్ ఎదురు చూస్తున్నారు.
పొంగల్ రేసులో కోలీవుడ్ నుంచి అజిత్ కూడా పోటీ పడుతున్నాడు. అజిత్ నటిస్తోన్న `గుడ్ బ్యాడ్ అగ్లీ` వాయిదా పడినా `విదామూయార్చి`ని రిలీజ్ చేయాలని ఇప్పటికే ప్రకటించారు. కోలీవుడ్ నుంచి పొంగల్ కానుకగా రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా ఇది. దీంతో `గేమ్ ఛేంజర్` పై కొంత ప్రభావం అక్కడ తప్పదు. అయితే ఇప్పుడా సమీకరణాలు మారుతున్నట్లు కనిపిస్తుంది. `విదా ముయార్చి` పై కాపీ రైట్ ఆరోపణలున్నాయి.
ఓ హాలీవుడ్ సినిమాకి కాపీ అనే ప్రచారం ఇప్పటికే జరుగుతోంది. ఇంత వరకూ సినిమాకి ప్రచారం పనులు కూడా మొదలు పెట్టలేదు. దీంతో ఈ సినిమా రిలీజ్ పై అనిశ్చితి నెలకొంది. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవుతుందా? అన్న డౌట్ వ్యక్తమవుతోంది. వాయిదా పడుతుందనే ప్రచారం కూడా కొన్ని మీడియా సంస్థల్లో జరుగుతోంది. అదే గనుక జరిగితే `గేమ్ చేంజర్` అక్కడ మార్కెట్ పరంగా కలిసొచ్చే అవకాశం ఉంది.