అప్పు దెబ్బకి ప్రెంచ్ సర్కస్ లో విన్యాసాలు!
అప్పుల్ని తట్టుకుని నిలబడిన వారు కొందరైతే? అదే అప్పుల బాధలు తాళ్లలేక ఆత్మహత్య చేసుకున్న వారు ఎంతోమంది.
సినిమా నిర్మాణమంటే కత్తి మీద సాము. సక్సెస్..పెయిల్యూర్ ని బ్యాలెన్స్ చేయాలి. ఒక సినిమా హిట్ అయితే మరో సినిమా ప్లాప్ అవుతుంది. ఆ రెండింటి మధ్య ఎలాంటి పరిస్థితులు తలెత్తినా బ్యాలెన్స్ చేసే సామర్ధ్యం నిర్మాతకు తప్పనిసరిగా ఉండాలి. నష్టాలతో అప్పుల ఊబిలో కూరికుపోయిన నిర్మాతలెంతో మంది. అప్పుల్ని తట్టుకుని నిలబడిన వారు కొందరైతే? అదే అప్పుల బాధలు తాళ్లలేక ఆత్మహత్య చేసుకున్న వారు ఎంతోమంది.
ముఖ్యంగా అప్పుల సమయంలో ఎంతో ఒత్తిడికి గురవుతుంటారు. దాన్ని బ్యాలెన్స్ చేసి ముందుకెళ్లడం అన్నది ప్రతీ నిర్మాత అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తాజాగా బాలీవుడ్ నటుడు కం డైరెక్టర్ నిర్మాత విద్యుత్ జమ్వాల్ కూడా అలాంటి పరిస్థితికి వెళ్లినట్లు కనిపిస్తుంది. ఆయన నిర్మించిన `క్రాక్` సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకుంది.
ఈసినిమాతో విద్యుత్ జమ్వాల్ అప్పుల పాలయ్యాడు. తాజాగా ఆ అనుభవాన్ని విద్యుత్ మీడియాతో పంచుకున్నారు. `క్రాక్ ప్లాప్ తో చాలా డబ్బు నష్టపోయాను. ఏం చేయాలో అర్దం కాలేదు. తీవ్రమైన ఒత్తిడి గురయ్యాను. అప్పులిచ్చిన వాళ్లంతా వేధించడం మొదలు పెట్టారు.దీంతో ఇలా ఉంటే లాభం లేదని ప్రెంచ్ సర్కస్ లో జాయిన్ అయ్యాను. 14 రోజుల పాటు అక్కడే ఉన్నాను. శరీరాన్ని నచ్చిన యాంగిల్స్ లో వంచుతున్న వారెంతో మంది ఉన్నారు.
ఇదెలా సాధ్యమని చాలా ఆలోచించా. వాళ్లు చెప్పే సమాధానం చూసి ఆశ్చర్యపోయేవాడిని. వాళ్లు ఎంత కష్టపడితే అంతలా వంచుతున్నారన్నది అర్దమైంది. ఆ సర్కస్ గదిలో అందరికంటే నేనే చిన్నగా ఉన్నాను. అలా 14 రోజులు గడిపే సరికి ఒత్తిడి పోయింది. ఆ తర్వాత ముంబై వచ్చాను. అప్పుల నుంచి బయట పడే ఆలోచన మొదలు పెట్టిన కొన్ని రోజులకే నా సమస్యలన్నీ తీరిపోయాయి. ఎలాంటి సమస్య వచ్చినా ప్రశాంతంగా ఉంటే ఎన్నో మార్గాలు కనిపిస్తాయి` అని అన్నారు.