విజయ్ 69.. అనిరుధ్ మార్క్ మరోసారి రిపీట్?

విజయ్ ఎంట్రీ సాంగ్ తో చిత్రీకరణ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది.

Update: 2024-10-09 04:15 GMT

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి.. రీసెంట్ గా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్- ది గోట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఆ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించారు. ఇప్పుడు ఆయన విజయ్ 69 ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు. ఆ సినిమా తర్వాత విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 2026 ఎన్నికలకు సన్నద్ధమవ్వనున్నట్లు సమాచారం.

దీంతో విజయ్ 69 అనౌన్స్మెంట్ నుంచే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్.. క్యాస్టింగ్ ప్రకటించిన తర్వాత అంచనాలు మరింత పెరిగాయి. పెద్ద ఎత్తున నటీనటులను రంగంలోకి దించారు మేకర్స్. హెచ్ వినోథ్ డైరెక్ట్ చేస్తున్న ఆ సినిమాలో విజయ్ కు జోడీగా పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే నటిస్తున్నారు. మరో హీరోయిన్ గా ప్రేమలు ఫేమ్ మమితా బైజు యాక్ట్ చేస్తున్నారు. బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ మేనన్, ప్రియమణి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

రీసెంట్ గా మేకర్స్.. చెన్నైలో విజయ్ 69 ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. విజయ్ ఎంట్రీ సాంగ్ తో చిత్రీకరణ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. వన్ లాస్ట్ సాంగ్ అంటూ సాగే మాస్ పాటను షూట్ చేసినట్లు సమాచారం. ఆ సాంగ్ కు అసల్ కోలారార్ లిరిక్స్ అందించగా.. విజయ్ స్వయంగా పాడినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అదిరిపోయేలా కంపోజ్ చేశారట.

ఆ పాటలో 500 మందికి పైగా ఆర్టిస్టులు.. విజయ్ తో డ్యాన్స్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాంగ్ పై మంచి హోప్స్ పెట్టుకున్నామని చెబుతున్నారు. సినిమా కోసం ఈగర్లీ వెయిటింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇప్పటికే విజయ్, అనిరుధ్, అసల్ కాంబినేషన్ లో నాన్ రెడీ సాంగ్ (లియో మూవీ) వచ్చిన విషయం తెలిసిందే. వేరే లెవల్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.

ఇప్పుడు మరోసారి వారి కాంబో రిపీట్ అవ్వడంతో.. వన్ లాస్ట్ సాంగ్ పై మంచి అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో విజయ్, అనిరుధ్ రవిచందర్ కలిసి వర్క్ చేసిన సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అనిరుధ్ వర్క్.. విజయ్ మూవీల్లోని అనేక సీన్స్ ను వేరే లెవెల్ లో మెప్పించేలా చేసింది. ఇప్పుడు విజయ్ చివరి మూవీకి కూడా అనిరుధ్ వర్క్ చేయడంతో.. అందరి దృష్టి సినిమాపై పడింది. మరి అనిరుధ్.. విజయ్ 69 సినిమాకు గాను ఎలాంటి అవుట్ పుట్ ఇస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News