మెగా టైటిల్ దేవరతో ఫైట్.. ఎలా సామీ ఇది..?

కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని తన ప్రత్యేకమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

Update: 2024-09-20 13:36 GMT

కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని తన ప్రత్యేకమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. బిచ్చగాడు సినిమాతో అతను తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ సినిమా ఇచ్చిన మార్కెట్ తో తన ప్రతి సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు విజయ్ ఆంటోని. బిచ్చగాడు తర్వాత చాలా సినిమాలు రిలీజ్ కాగా కేవలం మళ్లీ బిచ్చగాడు 2 మాత్రమే కమర్షియల్ గా వర్క్ అవుట్ అయ్యింది. బిచ్చగాడు 2 తర్వాత మళ్లీ వరుస సినిమాలతో తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు విజయ్ ఆంటోని. ఈమధ్యనే హత్య, తుఫాన్ అంటూ సినిమాలతో వచ్చిన విజయ్ ఆంటోని సినిమాలను ఎవరు పట్టించుకోలేదు.

అయినా సరే మళ్లీ మరో కొత్త సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు విజయ్ ఆంటోని. ఈసారి మెగాస్టార్ హిట్ సినిమా టైటిల్ హిట్లతో రేసులో నిలుస్తున్నాడు విజయ్ ఆంటోని. ధన శేఖరన్ డైరెక్షన్ లో తెరకెక్కిన హిట్లర్ సినిమా ఈ నెల 27న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతుంది. సెప్టెంబర్ 27 ఎన్టీఆర్ దేవర రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకు పోటీగా విజయ్ ఆంటోని రావడం విశేషంగా చెప్పుకోవచ్చు.

హిట్లర్ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు విజయ్ ఆంటోని. ఐతే పోటీగా తారక్ దేవర వస్తున్నా ధైర్యంగా రేసులో దిగుతున్నాడు. కోలీవుడ్ లో కూడా కార్తీ సత్యం సుందరం సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ అవుతుంది. అక్కడ కూడా దేవర, సత్య సుందరం తో పోటీ పడుతున్నాడు విజయ్ ఆంటోని. కమర్షియల్ సినిమాలతో పోటీకి దిగినా తను చేసే విలక్షణమైన కథల వల్ల విజయ్ ఆంటోని సినిమాలకు బజ్ ఉంటుంది.

దేవర యునానిమస్ హిట్ టాక్ వస్తే మాత్రం తెలుగులో హిట్లర్ కొట్టుకుపోయే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా హిట్లర్ బాగుండి దేవర టాక్ అటు ఇటుగా ఉంటే అప్పుడు విజయ్ ఆంటోనికి ప్లస్ అవుతుంది. ఏది ఏమైనా ఎన్ టీ ఆర్ తో పోటీకి వచ్చేందుకు విజయ్ ఆంటోని హిట్లర్ రెడీ అవ్వడం షాక్ ఇస్తుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న హిట్లర్ సినిమా ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. మరి సినిమా ఎలా ఉంటుంది అన్నది వారంలో తెలుస్తుంది.

Tags:    

Similar News