యుద్ద భూమిలో దేవరకొండ పోరాటం కోసం ఇలా!
రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లాక్ అయిన సంగతి తెలిసిందే.
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ స్పై థ్రిల్లర్ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా ముగింపు దశకు చేరుకుంది. దేవరకొండ మరి కొన్నిరోజలు షూట్ కి వెళ్లే పూర్తవుతుంది. ప్రస్తుతం షూటింగ్ కి తాత్కాలికంగా విరామం ఇచ్చారు. అయితే విజయ్ మాత్రం బ్రేక్ తీసుకోలేదు. తదుపరి సినిమాకి ముందొస్తుగానే రెడీ అవుతున్నాడు.
రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లాక్ అయిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ ఈపీరియాడిక్ చిత్రాన్నినిర్మిస్తుంది. 18వశతాబ్దం నాటి కథతో వర్తమాన కాలానికి ముడి పెట్టి తీస్తోన్న చిత్రమిది. భారీ యాక్షన్ వార్ సినిమా గా రూపొందనుంది. ఈ నేపథ్యంలో విజయ్ సినిమా కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాడు. వార్ సన్నివేశాలకు సంబంధించి యుద్దంలో ప్రావీణ్యం సంపాదిస్తున్నాడు.
కొంత మంది విదేశీ బృందం ఆయనకు ట్రైనింగ్ ఇస్తున్నట్లు సమాచారం. అలాగే గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంటున్నాడుట. దానికి సంబంధించి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌సూచనలు సలహాలు కూడా తీసుకుంటున్నారుట. గుర్రపు స్వారీ చేయడంలో చరణ్ మాస్టర్ అన్న సంగతి తెలిసిందే.
ఆయన ఇంట రెండు పెంపుడు గుర్రాలు కూడా ఉన్నాయి. అందులో ఓ దాని పేరు బాద్ షా... విజయ్ కి ఇప్పుడు స్వారీ సన్నివేశాలు చేయాల్సిన పరిస్థితి రావడంతో ఓవైపు తన టీమ్ తో పనిచేస్తూనే చరణ్ ఖాళీ సమయంలో ఆయన వద్ద కూడా క్లాస్ లు తీసుకుంటున్నాడుట. ఇందులో విజయ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడని సమాచారం. అంతే కాదు రాయలసీమ యాసలోనూ మాట్లాడాల్సి రావడంతో ఆ భాషకు సంబంధించిన ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడుట. మొత్తానికి ఒకే సినిమా కోసం విజయ్ రకరకాలుగా పనిచేయాల్సి రావడం ఇదే తొలిసారి.