రష్మిక 'గర్ల్ ఫ్రెండ్' కోసం విజయ్ ఇలా..
టీజర్ లో రష్మిక ను ఇంట్రడ్యూస్ చేయడంతోపాటు ఆమె పాత్రను నెరేట్ చేసిన సీన్స్ కు స్టార్ హీరో విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ ఇచ్చారని సమాచారం.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మరికొన్ని గంటల్లో పుష్ప-2 మూవీతో సందడి చేయనున్నారు. శ్రీవల్లి 2.0గా సినీ ప్రియులను, అభిమానులను అలరించనున్నారు. అదే సమయంలో అనేక ప్రాజెక్టుల్లో నటిస్తూ వరుస షూటింగ్స్ లో పాల్గొంటున్నారు అమ్మడు.
ఓవైపు పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో సత్తా చాటుతున్న రష్మిక.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు. టాలీవుడ్ యాక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ మూవీలో లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ఆమె గ్లింప్స్.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.
అయితే ది గర్ల్ ఫ్రెండ్ మూవీ టీజర్ కోసం రీసెంట్ గా డైరెక్టర్ సుకుమార్.. పుష్ప-2 ఈవెంట్ లో ప్రస్తావించిన విషయం తెలిసిందే. రాహుల్ టీజర్ ను చూపించారని.. చాలా బాగుందని తెలిపారు. అన్నీ రష్మిక క్లోజప్స్ షాట్స్ ఉన్నాయని, మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారని చెప్పారు. దీంతో టీజర్ పై అంచనాలు పెరిగిపోయాయి.
అదే సమయంలో మేకర్స్.. త్వరలో టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు నిన్న తెలిపారు. గర్ల్ ఫ్రెండ్ టీజర్ ను పుష్ప-2 సినిమాతో పాటు ప్లే చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. గర్ల్ ఫ్రెండ్ టీజర్ లో స్పెషాలిటీ ఉందని టాక్ వినిపిస్తోంది.
టీజర్ లో రష్మిక ను ఇంట్రడ్యూస్ చేయడంతోపాటు ఆమె పాత్రను నెరేట్ చేసిన సీన్స్ కు స్టార్ హీరో విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ ఇచ్చారని సమాచారం. అస్సలు పడను అనే డైలాగ్ టీజర్ లో ఉందట. అయితే విజయ్, రష్మిక రిలేషన్ లో ఉన్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తుండటంతో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
మొత్తానికి తన గర్ల్ ఫ్రెండ్ నటిస్తున్న గర్ల్ ఫ్రెండ్ మూవీ టీజర్ కు విజయ్ వాయిస్ ఓవర్ ఇచ్చారన్నమాట అని నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. అయితే ఆ సినిమాలో కన్నడ యాక్టర్ దీక్షిత్ శెట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. మరి గర్ల్ ఫ్రెండ్ మూవీ టీజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.