కింగ్‌డమ్.. డబ్బింగ్ మోడ్ లో దేవరకొండ
విజయ్ దేవరకొండ నటిస్తున్న ప్యాన్ ఇండియా మూవీ కింగ్‌డమ్ ప్రస్తుతం నిర్మాణానంతర దశలో దూసుకెళ్తోంది.;

విజయ్ దేవరకొండ నటిస్తున్న ప్యాన్ ఇండియా మూవీ కింగ్‌డమ్ ప్రస్తుతం నిర్మాణానంతర దశలో దూసుకెళ్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ కోసం, విజయ్ ఇటీవల హైదరాబాద్‌లోని ఓ డబ్బింగ్ స్టూడియోకి వచ్చారు. అక్కడ ఆయనకు కెమెరాలు క్యాచ్ అవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు, లుక్ పోస్టర్స్ సినిమాపై భారీ బజ్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా డబ్బింగ్ స్టేజ్‌లోకి ఎంటర్ కావడం చూస్తే, ట్రైలర్ త్వరలోనే వస్తుందనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఇది కూడా విడుదల అయితే, సినిమాలో విజయ్ కనిపించే కొత్త అవతారంపై మరింత క్లారిటీ రావొచ్చు.
విజయ్ ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. గౌతమ్ తిన్ననూరి తన గత సినిమాల్లో ఎమోషనల్ డ్రామాతో మంచి మార్క్ సంపాదించగా, ఈసారి మాత్రం యాక్షన్, ఇంటెన్సిటీతో సరికొత్త కథను చూపించనున్నాడు. ఇక త్వరలోనే ట్రైలర్ కట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే డబ్బింగ్ స్టూడియో వద్ద విజయ్ హావభావాలు, డైరెక్టర్ గౌతమ్ తో మాట్లాడిన తీరుతో ఎనర్జీ హైగా ఉండబోతోందని అర్థమవుతోంది.
టెక్నికల్ పరంగా కూడా ఈ సినిమా హైలైట్ కానుంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ కంపోజ్ చేస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ను మరింత మాస్ లెవెల్‌కు తీసుకెళ్లే అవకాశముంది. అలాగే కెమెరా వర్క్, ప్రొడక్షన్ డిజైన్ కూడా హై స్టాండర్డ్స్‌తో ఉంటుందని సమాచారం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
‘కింగ్‌డమ్’ సినిమాను రెండు పార్ట్‌లుగా ప్లాన్ చేసినట్టు సమాచారం. ట్రైలర్, ఆడియో, ప్రీ రిలీజ్ ఈవెంట్లకు సంబంధించిన అధికారిక సమాచారం త్వరలోనే రానుంది. ప్రస్తుతం విజయ్ డబ్బింగ్ పూర్తి చేసి, ప్రమోషన్స్ దశలోకి అడుగుపెట్టనున్నాడని సమాచారం. ఇక సినిమాను మే 30న రిలీజ్ చేయాలన్నది ప్లాన్. ఇదిలా ఉంటే, విజయ్ దేవరకొండ వరుసగా ప్యాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నారు. కింగ్‌డమ్ కూడా ఆ విధంగానే ఓ ఇంటెన్స్ పోలీస్ డ్రామాగా ఉంటుందని అభిమానులు ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు.