నిదానమే ప్రధానమా దేవరకొండ!
అయితే ఆ సినిమా ఫలితాలు ఇప్పుడా వేగాన్ని పూర్తిగా తగ్గించాయి. నిదానమే ప్రధానం అన్నట్లుగా ప్లానింగ్ కనిపిస్తుంది.
టాలీవుడ్ కి వరుస విజయాలతో ఉవ్వెత్తున దూసుకొచ్చిన విజయ్ దేవరకొండ ఒక్కసారిగా స్లో అయ్యాడు. `అర్జున్ రెడ్డి`, `గీతగోవిందం` తర్వాత ఒకే స్పీడ్ తో సినిమాలు చేసాడు. ఫ్యామిలీ స్టార్ రిలీజ్ వరకూ ఇదే దూకుడు చూపిం చాడు. ఒక సినిమా సెట్స్ లో ఉండగానే మరో సినిమాకు కమిట్ అవ్వడం..దాన్ని పట్టాలెక్కించడం అంతా చాలా వేగంగా చేసాడు. అయితే ఆ సినిమా ఫలితాలు ఇప్పుడా వేగాన్ని పూర్తిగా తగ్గించాయి. నిదానమే ప్రధానం అన్నట్లుగా ప్లానింగ్ కనిపిస్తుంది.
ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తన 12వ చిత్రం ఆన్ సెట్స్ లో ఉంది. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుంది. అయితే మునిపటిలా ఇప్పుడు సినిమాలు కమిట్ అవ్వడం లేదు. కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే ఇద్దరు యంగ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చాడు. రాహుల్ సంకృత్యన్ తో ఓ సినిమా...రవి కిరణ్ కోలాతో మరో సినిమాకి కమిట్ అయ్యాడు. కానీ వాటిని ఇంకా పట్టాలెక్కించలేదు.
వీడి12 రిలీజ్ తర్వాతే వాటి గురించి ఆలోచించేలా కనిపిస్తున్నాడు. ఒకేసారి అన్ని సినిమాలు సెట్స్ కు తీసుకెళ్లడం విజయ్ కి ఏమాత్రం కలిసి రాలేదు. అందుకు గత పరాభవాలే ఉదాహరణలు. వరుస రిలీజ్ లు కూడా విజయ్ కి కలిసి రాలేదు. వీడి 12 వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఆ తర్వాత మళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదు. సినిమా షూటింగ్ కూడా చాలా నెమ్మదిగానే జరుగుతోంది. గౌతమ్ తిన్ననూరి మేకింగ్ విషయంలో కాస్త స్లోగానే ఉంటాడు.
కంగారు పడి సినిమా చేయడు. సెట్స్ కి వెళ్లిన తర్వాత ఆయన సుకుమార్ లా ఎన్నో ఆలోచనలతో తెరకె క్కిస్తుంటాడు. అవసరం మేర అప్పటికప్పుడు మార్పులు చేస్తుంటారు. అందుకే సినిమా డిలే అవుతుందని వినిపిస్తోంది. అయితే ఆయన కారణంగా విజయ్ తదుపరి కమిట్ మెంట్లు కూడా ఆలస్యమవుతుంది అన్నది ఇక్కడ గురించాల్సిన విషయం.