రిటైర్మెంట్ కు ముందే షాక్ ఇచ్చిన స్టార్ హీరో!
అత్యంత ప్రతిష్టాత్మకగా తెరకెక్కిస్తున్నారు. మరి విజయ్ చివరి చిత్రం పారితోషికం ఎంత అంటే? భారీ లెక్క బయటకు వచ్చింది.;

తలపతి విజయ్ సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో తమిళనాడు నుంచి బరిలోకి దిగడంతో? సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాలకు స్వాగతం పలుతుకున్నాడు. ఇప్పటికే పార్టీ స్థాపించి దాన్ని బలోపేతం చేసే పనిలో ఉన్నాడు. అయితే చివరి సినిమాగా 69వ చిత్రం `జన నాయగన్` చేస్తున్నాడు. ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో చేస్తోన్న చిత్రం.
అత్యంత ప్రతిష్టాత్మకగా తెరకెక్కిస్తున్నారు. మరి విజయ్ చివరి చిత్రం పారితోషికం ఎంత అంటే? భారీ లెక్క బయటకు వచ్చింది. ఈ సినిమాకు గాను విజయ్ 125 కోట్లు తీసుకుంటున్నాడుట. ఈ చిత్రాన్ని కేవీ ఎన్ ప్రొడక్షన్స్ విజయ్ డిమాండ్ చేయకుండానే ఇంత మొత్తంలో ఇస్తుందిట. అడ్వాన్స్ రూపంలో 50 కోట్లు అందాయని మిగిలిన అమౌంట్ చిత్రీకరణ పూర్తయిన తర్వాత అందించేలా ఒప్పందం చేసు కున్నారుట. విజయ్ మార్కెట్ ఆధారంగానే ఇంత మొత్తంలో చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలోనే విజయ్ ఓ సినిమాకు 150 కోట్లకు పైగా పారితోషికం తీసుకున్నట్లు ప్రచారంలోకి వచ్చింది. కానీ అందులో క్లారిటీ లేదు. కానీ `జన నాయగన్` విషయంలో మాత్రం కోలీవుడ్ మీడియాలో ఇప్పుడీ అంశం హాట్ టాపిక్ గా మారింది. విజయ్ రాజకీయంగా బిజీ అయ్యే క్రమంలో భారీగా డబ్బు అవసరం పడే అవకాశం ఉండటంతో కేవీఎన్ హీరోపై అభిమానంతో ఇంత మొత్తంలో చెల్లించినట్లు వార్తలొస్తున్నాయి.
ఒకవేళ భవిష్యత్ లో విజయ్ మళ్లీ కంబ్యాక్ అయ్యే ఆలోచన ఉంటే తమ సంస్థలోనే సినిమా చేస్తాడనే ఆశ కూడా సదరు సంస్థ వ్యక్తం చేస్తుందిట. పార్టీ నడపాలంటే డబ్బు తప్పని సరి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఎంత ఇబ్బంది పడ్డాడో? తెలిసిందే. సీరియస్ గా సినిమాలు మానేసి రాజకీయాలు చేస్తానని వెళ్లిన పవన్ తిరిగి డబ్బులు కోసం మళ్లీ సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. మరి విజయ్ స్ట్రాటజీ ఎలా ఉండబోతుందో చూడాలి.