కె.జి.ఎఫ్+సలార్+దేవర = కింగ్ డమ్
లేటెస్ట్ గా ది విజయ్ దేవరకొండ కూడా కింగ్ డమ్ తో ఈసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు.
పాన్ ఇండియా రేసులో దిగుతున్న స్టార్ సినిమాల విషయంలో డైరెక్టర్స్ అంతా కూడా ఒకటే ఫార్మెట్ ఫాలో అవుతున్నారన్న టాక్ వినిపిస్తూనే ఉంది. కథ కాస్త అటు ఇటుగా ఒకేలా ఉంటూ సినిమాకు ఏర్పాటు చేస్తున్న వరల్డ్ ని కూడా అదే తరహాని ఫాలో అవుతున్నారు. నేషనల్ వైడ్ ఆడియన్స్ ని అలరించడానికి చేస్తున్న ఈ ప్రయత్నంలో భాగంగా వస్తున్న సినిమాలు భారీ హైప్ తెచ్చుకుంటున్నాయి. లేటెస్ట్ గా ది విజయ్ దేవరకొండ కూడా కింగ్ డమ్ తో ఈసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు.
గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ కింగ్ డమ్ టీజర్ లేటెస్ట్ గా రిలీజ్ కాగా. ఈ టీజర్ చూసిన ఫ్యాన్స్ నెక్స్ట్ లెవెల్ అనేస్తున్నారు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న గూస్ బంప్స్ స్టఫ్ తో కింగ్ డమ్ వస్తుంది. టీజర్ చూసిన అందరు ఫస్ట్ క్లాస్, అదిరిపోయిందనే అంటున్నారు. ముఖ్యంగా విజువల్స్ వేరే లెవెల్ అనిపించాయి. ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ కూడా మ్యాజిక్ చేసేలా ఉంది.
టీజర్ అయితే సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. విజయ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న పర్ఫెక్ట్ బొమ్మగా కింగ్ డమ్ ఇన్ స్టంట్ క్రేజ్ తెచ్చుకుంది. ఐతే ఈ టీజర్ చూసిన కొందరు ఈమధ్య వచ్చిన కొన్ని సినిమాలతో పోల్చి చూస్తున్నారు. విజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమా టీజర్ చూసిన కొందరు ఈ సినిమా K.G.F ని ఫాలో అవుతూ, సలార్ ని గుర్తు చేస్తూ, దేవర దారిలో వెళ్లారా అన్నట్టు అనిపిస్తుంది.
అంటే కె.జి.ఎఫ్ + సలార్ + దేవర కలిపి మిక్సీ పడితే విజయ్ దేవరకొండ కింగ్ డమ్ వచ్చేలా ఉంది. ఐతే టీజర్ చూసినప్పుడు ఇలాంటి పోలికలు సర్వ సాధారణమే. ఐతే అక్కడ ఉంది గౌతం తిన్ననూరి కాబట్టి కచ్చితంగా మ్యాజిక్ చేస్తాడని చెప్పొచ్చు. అంతేకాదు విజయ్ దేవరకొండ ఈ సినిమాను కసితో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. దేవరకొండ కింగ్ డమ్ మరి ఆ సినిమాలతో పోలిక ఉంటుందా లేదా కొత్త కథతో వస్తున్నారా.. అసలు దేవరకొండ విజయ్ కింగ్ డమ్ ఎలా ఉంటుంది లాంటి ప్రశ్నలకు సమాధానం మాత్రం మే 30న సమాధానం దొరుకుతుంది.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది.