హీరోని ఇష్టపడి చేస్తున్నాడు అంటే..?
ఈ విషయాన్ని అతనే రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పాడు.;
ఒక డైరెక్టర్ హీరోని ఇష్టపడుతూ సినిమా చేస్తే ఆ సినిమా అవుట్ పుట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ముఖ్యంగా ప్రతి డైరెక్టర్ తను చేసే సినిమా హీరోని అభిమానిస్తూ ఆ హీరో ఫ్యాన్స్ ఆయన్ను ఎలా చూడాలని అనుకుంటారో అలా చూపించాలని చూస్తారు. ఐతే విజయ్ దేవరకొండ తో నెక్స్ట్ సినిమా తీయబోయే రవి కిరణ్ కోలా మాత్రం విజయ్ దేవరకొండని ఒక ఫ్యాన్ బాయ్ గా డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని అతనే రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పాడు.
అర్జున్ రెడ్డి సినిమా చూశాక తన కళ్లకు విజయ్ దేవరకొండ చాలా పెద్దగా కనిపించాడని అప్పటి నుంచి అతన్ని ఇష్టపడుతున్నట్టుగా చెప్పుకొచ్చాడు రవి కిరణ్ కోలా. ఐతే అశోక వనంలో అర్జున కళ్యాణం తర్వాత విజయ్ దేవరకొండతోనే రవి కిరణ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో మాస్ కథతో రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్ తోనే బ్లడ్ బాత్ తో హంగామా చేశారు.
దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి కచ్చితంగా ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా రవి కిరణ్ కోలాకి విజయ్ దేవరకొండ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ అనే విషయం తెలిసే సరికి విజయ్ ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్ పై మరింత ఎగ్జైట్ మెంట్ చూపిస్తున్నారు. తప్పకుండా విజయ్ దేవరకొండ కెరీర్ లో ఇదొక క్రేజీ సినిమాగా ఉండబోతుందని మాత్రం అర్ధమవుతుంది.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతం తిన్ననూరితో కింగ్ డం సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ఈ సమ్మర్ కి రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ రవికిరణ్ కోలా సినిమా కూడా ఈ ఇయర్ లోనే రిలీజ్ ఉంటుందని టాక్. ఈ మూవీపై డైరెక్టర్ రవి కిరణ్ చేస్తున్న ఫోకస్ చూస్తుంటే ఇదేదో గట్టిగానే వర్క్ అవుట్ అయ్యేలా ఉందని చెప్పొచ్చు.
విజయ్ దేవరకొండ రవి కిరణ్ కోలా తర్వాత రాహుల్ సంకృత్యన్ తో సినిమా లైన్ లో పెట్టాడు. ఈ మూవీ కూడా పీరియాడికల్ కథతో వస్తుందని తెలుస్తుంది. సో విజయ్ దేవరకొండ సినిమాల లిస్ట్ చూస్తే మాత్రం ఫ్యాంస్ కి సూపర్ ఎగ్జైట్ అనిపిస్తుంది. కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లు లేని వీడీ ఈసారి రాబోతున్న సినిమాలతో చాలా పెద్ద స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది.