విజయ్‌ సేతుపతి ఆలోచనల్లో మార్పు వచ్చిందా...?

తాజాగా విడుదల పార్ట్‌ 2 సినిమాలో నటించాడు. ఈ వారంలో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళ్‌తో పాటు తెలుగులోనూ భారీ ఎత్తున ఆ సినిమాను విడుదల చేయబోతున్నారు.

Update: 2024-12-17 13:30 GMT

విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి కెరీర్‌ ఆరంభంలో అన్ని రకాల పాత్రలు చేస్తూ వచ్చాడు. తెలుగులో ఉప్పెన సినిమాలో విలన్‌ పాత్రను పోషించి మెప్పించాడు. తమిళ్‌ మూవీ మాస్టర్‌లోనూ విలన్‌ రోల్‌లో నటించి మెప్పించిన విషయం తెల్సిందే. విలన్‌ పాత్రలను పోషించడం ద్వారా తనలోని నటుడిని చూపించే ప్రయత్నం చేసిన విజయ్‌ సేతుపతి ఈ మధ్య కాలంలో ఎక్కువగా విలన్‌ పాత్రలకు ఓకే చెప్పడం లేదు. కొందరు ఫిల్మ్‌ మేకర్స్‌ వెళ్లి నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలను చెప్పే ప్రయత్నం చేస్తే సున్నితంగా వాటిని తిరస్కరిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఆయన తీరు గతంతో పోల్చితే మారిందనే వార్తలు వస్తున్నాయి.

తాజాగా విడుదల పార్ట్‌ 2 సినిమాలో నటించాడు. ఈ వారంలో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళ్‌తో పాటు తెలుగులోనూ భారీ ఎత్తున ఆ సినిమాను విడుదల చేయబోతున్నారు. వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా తెలుగు మీడియాతో మాట్లాడుతూ తెలుగులో నటించడం కోసం వెయిట్‌ చేస్తున్నాను అన్నాడు. అయితే ఉప్పెనలో పోషించిన పాత్ర వంటి పాత్రల్లో కాకుండా ప్రధాన పాత్రల్లో నటించాలని అనుకుంటున్నట్లుగా ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడం జరిగింది.

విజయ్ సేతుపతి గతంలో అన్ని ముఖ్య పాత్రల్లో అంటే నెగటివ్‌ షేడ్స్‌ పాత్రలో, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించేందుకు సిద్ధంగా ఉండేవాడు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన సినిమాల ఎంపిక విషయానికి వస్తే చాలా తేడా ఉందని, ఆయన కేవలం హీరోగా మాత్రమే నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు. మలయాళ స్టార్‌ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ ఒక వైపు హీరోగా నటిస్తూ మరో వైపు విలన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్టు పాత్రలు పోషిస్తూ ఉంటాడు. అలా విజయ్ సేతుపతి ఎందుకు అన్ని రకాల పాత్రలు పోషించడం లేదు అంటూ కొందరు ఆయన్ను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు.

తెలుగులో హీరో పాత్రలు వస్తే నటించేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పిన విజయ్‌ సేతుపతి ఆ సమయంలో విలన్‌ రోల్స్‌ను సున్నితంగా తిరస్కరిస్తాను అంటూ చెప్పకనే చెప్పాడు. అందుకే బుచ్చిబాబు, రామ్‌ చరణ్ కాంబోలో రూపొందుతున్న స్పోర్ట్స్‌ డ్రామాలో విజయ్‌ సేతుపతి కోసం ఒక మంచి పాత్ర ఉన్నా దాన్ని తిరస్కరించాడట. ఈ విషయాన్ని యూనిట్‌ సభ్యులు ఆఫ్‌ ది రికార్డ్‌ చెబుతున్నారు. విజయ్ సేతుపతిని హీరోగా చూడాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్న మాట వాస్తవం. అయితే ఎక్కువ మంది ఫ్యాన్స్‌ ఆయన అన్ని పాత్రలు చేస్తే చూడాలని కోరుకుంటున్నారు. మరి ఈ విషయాన్ని ఆయన ఎలా తీసుకుంటాడు చూడాలి.

Tags:    

Similar News