ఆ హీరో పాత్ర ఇదేం గందరగోళం!
అయితే ఇందులో విజయ్ గెటప్ లు మాత్రం అందర్నీ ఆశ్చపరిచాయి.
ఇటీవల రిలీజ్ అయిన 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్'బాక్సాఫీస్ వద్ద పొరాటం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా 200 కోట్ల వసూళ్లను సాధించింది. తమిళనాడు మార్కెట్ లో సినిమా బాగానే రాణిస్తుం డటంతో ఈ వసూళ్లు కనిపిస్తున్నాయి. మిగతా చోట్ల సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో విజయ్ గెటప్ లు మాత్రం అందర్నీ ఆశ్చపరిచాయి.
ముఖ్యంగా ద్వితియార్ధంలో యంగ్ విజయ్ ని ఆవిష్కరించిన తీరు ప్రేక్షకుల్ని ఆశ్చర్య పరిచింది. 20 ఏళ్ల యువకుడిలా విజయ్ పాత్రను హైలైట్ చేయడం అంతటా చర్చనీయాంశంగా మారింది. ఏఐ సాయంతో డీ-ఏజింగ్ విజయ్ కి ఆ లుక్ తీసుకొస్తున్నట్లు వైరల్ అవుతుంది. అయితే అసలు సంగతి ఏంటి? అంటే అక్కడ ఎలాంటి టెక్నాలజీ వాడలేదని వినిపిస్తోంది. విజయ్ కనిపించాల్సిన ఆ పాత్రలో కోలీవుడ్ నటుడు ఆయాజ్ ఖాన్ నటించినట్లు ప్రచారం జరుగుతోంది.
విజయ్ 20 ఏళ్ల వయసులో ఉంటే ఎలా ఉంటాడో? సరిగ్గా అదే లుక్ ని ఆయాజ్ ఖాన్ లో తీసుకొచ్చి రంగంలోకి దించినట్లు వినిపిస్తుంది. అయితే ఇదే పాత్ర ని డీఏజింగ్ టెక్నాలజీ ద్వారా ఏ ఐ సాయంతో పున సృష్టించినట్లు ఇప్పటికే వైరల్ అయింది. దీనిపై ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక అప్ డేట్ లేదు. మరి ఇందులో ఏది నిజం ? ఎవరు నిజం? అన్నది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) అన్ని రంగాల్ని ఏల్తోంది. సినిమా పరంగా చూసుకుంటే! ఏఐ మాయాజాలం ఇప్పుడు సినిమాకి ఓ వరంగా మారింది. చనిపోయిన నటుల్ని సైతం ఏఐ టెక్నాలజీతో తెరపైకి తెస్తున్నారు. నటీనటులు షూటింగ్ కి అందుబాటులో లేకపోతే అత్యవసరం అనుకుంటే? వాళ్ల అనుమతితో పాత్రల్ని సృష్టిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ నటుడు సెట్స్ లో అందుబాటులో లేకపోయినా? ఏఐతో తన పని పూర్తి చేయగల్గుతున్నారు.