విజయ్ 69.. ఆమె ఫిక్స్ అయినట్లే..?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి.. రీసెంట్ గా ది గోట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

Update: 2024-10-01 15:30 GMT

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి.. రీసెంట్ గా ది గోట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఆ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ పోషించారు. తండ్రీకొడుకుల పాత్రల్లో కనిపించారు. యాక్ష‌న్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ది గోట్.. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో అక్టోబర్ 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.

అయితే విజయ్ 69 మూవీ అనౌన్స్మెంట్ కూడా రీసెంట్ గా వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. 69వ మూవీనే త‌న చివ‌రి సినిమా అని ఇన్‌ డైరెక్ట్‌ గా ప్రకటించారు. దీంతో అనౌన్స్మెంట్‌ కు ముందే సినిమాపై భారీగా బ‌జ్ క్రియేట్ అయింది. విజయ్ లాస్ట్ మూవీకి పలువురు స్టార్ డైరెక్టర్ల పేర్లు వినిపించగా.. ఊహించిన విధంగా హెచ్ వినోథ్‌ కే డైరెక్ట్ చేసే అవకాశం ద‌క్కింది. భారీ బ‌డ్జెట్ తో కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ మూవీని నిర్మిస్తోంది.

ఫస్ట్ కోలీవుడ్ మూవీని నిర్మిస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్.. విజయ్ 69 అనౌన్స్మెంట్ టైమ్ లో పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. అందులో టార్చ్ బేర‌ర్ ప‌ట్టుకున్న ఓ వ్య‌క్తి చేయి క‌నిపిస్తోంది. ప్ర‌జాస్వామ్యానికి ఆయనో టార్చ్ బేర‌ర్ అంటూ ప్రీ లుక్ పోస్ట‌ర్‌ పై ఉన్న క్యాప్ష‌న్.. మూవీపై ఆసక్తి రేపుతోంది. అయితే అక్టోబర్ 3వ తేదీన విజయ్ 69 ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు జరగనున్నాయని, ఆ తర్వాత రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని సమాచారం.

అదే సమయంలో మేకర్స్.. సోషల్ మీడియాలో క్రేజీ అనౌన్స్మెంట్ చేశారు. మీ అంచనాలు సరిగా ఉన్నాయో లేదో చూద్దామంటూ క్యాప్షన్ ఇచ్చి.. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి మూడు రోజుల వరకు క్యాస్టింగ్ ను ప్రకటిస్తామని చెప్పారు. దీంతో విజయ్ చివరి మూవీలో ఎవరు నటిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హీరోయిన్ గా పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డేను మేకర్స్ ఫిక్స్ చేసినట్లు తాజాగా టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే విజయ్ తో బీస్ట్ మూవీలో పూజా హెగ్డే స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి వారి కాంబో రిపీట్ అవ్వనుందని వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ కూడా విజయ్ 69లో కీలక పాత్ర పోషించనున్నారని సమాచారం. ఇప్పటికే తమిళ మూవీ కంగువలో నటిస్తున్న ఆయన.. ఇందులో కూడా యాక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి విజయ్ 69 ప్రాజెక్ట్ క్యాస్టింగ్ విషయంలో వస్తున్న వార్తలు నిజమో కాదో చూడాలి.

Tags:    

Similar News