కెరీర్ మొత్తం మీద సవాలు అనిపించిన పాత్ర ఇదే..!

మీర్జాపూర్ లో చేసిన భరత్ త్యాగి నుంచి ఐసీ 814 లో చేసిన దేవి శరణ్ పాత్ర వరకు ప్రతీదీ ప్రత్యేకమే అని చెప్పారు విజయ్ వర్మ.

Update: 2024-09-10 14:30 GMT

బాలీవుడ్ లో ఈమధ్య తరచు వినిపిస్తున్న యాక్టర్ పేరు విజయ్ వర్మ. తన సినిమాలు, సీరీస్ లతో పాటుగా మిల్కీ బ్యూటీ తమన్నాతో ప్రేమాయణంతో మరింత పాపులర్ అయ్యాడు. విజయ్ వర్మ, తమన్నాల ప్రేమ వ్యవహారం ఎంతవరకు వచ్చింది అన్నది వారిద్దరు క్లారిటీ ఇవ్వట్లేదు. ఐతే ఎక్కడపడితే అక్కడ జంటగా కనిపిస్తూ మీడియాకు కావాల్సినంత స్టఫ్ ఇస్తున్నారని మాత్రం చెప్పొచ్చు. ఇక నటుడిగా విజయ్ వర్మ ఈమధ్య ట్రెండింగ్ లో ఉంటున్నాడు. లేటెస్ట్ గా అతను నటించిన ఐసీ 814 వెబ్ సీరీస్ ప్రేక్షకులను మెప్పించింది.

అనుభవ్ సిన్హా డైరెక్షన్లో తెరకెక్కిన ఈ ఐసీ 814 కాంధార్ హైజాక్ ను కెప్టెన్ దేవి శరణ్, శ్రింజయ్ చౌదురి రచించిన ఫ్లైట్ ఇంటూ ఫియర్ బుక్ ఆధారంగా తెరకెక్కించారు. ఈ సీరీస్ 6 ఎపిసోడ్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రీసెంట్ గా రిలీజైన ఈ వెబ్ సీరీస్ కు వస్తున్న రెస్పాన్స్ పై తన సంతోషాన్ని వ్యక్తపరిచారు విజయ్ వర్మ. ఐసీ 814 సీరీస్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తే ఆనందంతో మాటలు రావట్లేదని అన్నారు. మీర్జాపూర్ లో చేసిన భరత్ త్యాగి నుంచి ఐసీ 814 లో చేసిన దేవి శరణ్ పాత్ర వరకు ప్రతీదీ ప్రత్యేకమే అని చెప్పారు విజయ్ వర్మ.

జీవితం తనకు ఇచ్చిన బహుమతులు అంటూ తనను ప్రేక్షకులు ఆదరిస్తున్న తీరుకి సంతృప్తి వ్యక్తం చేశారు విజయ్ వర్మ. మంచి పాత్రలు చేస్తూ కెరీర్ పరంగా స్థాయిని కూడా పెంచుకుంటూ వెళ్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఐసీ 814 లో కెప్టెన్ గా నటించడం పెద్ద సవాలుతో కూడుకున్న పని అని.. అయినా సరే నా లిమిట్స్ ని దాటి ఆ రోల్ చేశానని అన్నారు. ఆ పాత్ర కోసం ఎంతో కష్టపడ్డానని చెప్పిన విజయ్ వర్మ తను పడిన కష్టానికి ప్రశంసలు వస్తుంటే మాటల్లో చెప్పలేనంత ఆనందగా ఉందని అన్నారు.

ఇలాంటి సీరీస్ లో భాగం అయినందుకు సంతోషంగా ఉందని.. సీరీస్ చూశాక ఎంతోమంద్ ఫోన్ చేసి అభినందిస్తున్నారని అన్నారు. అంతేకాదు ఈ సీరీస్ లో తన పాత్ర గురించి ఎంతోమంది లెటర్స్ కూడా రాస్తున్నారని అన్నారు విజయ్ వర్మ. కాంధార్ హైజాక్ ని తెరరూపం దాల్చాలని ఆలోచనే పెద్ద సాహసమని చెప్పొచ్చు. అలాంటి ప్రయత్నంలో తెరకెక్కించిన ఐసీ 814 ది కాంధార్ హైజాక్ వెబ్ సీరీస్ ప్రేక్షకులకు మంచి అనుభూతి కలిగిస్తుంది. ఈ వెబ్ సీరీస్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

Tags:    

Similar News