రౌడీ స్టార్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్.. ఇలా సాగుతున్నాయి

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నుంచి నెక్స్ట్ మూడు పాన్ ఇండియా సినిమాలు రాబోతున్నాయి.

Update: 2024-09-29 04:19 GMT

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నుంచి నెక్స్ట్ మూడు పాన్ ఇండియా సినిమాలు రాబోతున్నాయి. ఈ ఏడాది ‘ది ఫ్యామిలీ’ స్టార్ తో విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకొచ్చి ఊహించని విధంగా డిజాస్టర్ అందుకున్నాడు. నెక్స్ట్ రాబోయే ‘VD12’ సినిమాతో మాత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అందుకే ఈ సినిమా కోసం విజయ్ తన లుక్స్ కూడా చేంజ్ చేసుకున్నాడట.

డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో ‘VD12’ మూవీ తెరకెక్కుతోంది. మూవీ షూటింగ్ ఆల్ మోస్ట్ చివరి దశకి వచ్చేసింది. 2025 మార్చి 28న రిలీజ్ కాబోతోందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. సినిమా మీద విజయ్ చాలా నమ్మకంగా ఉన్నాడు. దీని తర్వాత రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్తున్నాడు. ఈ సినిమా లాంచింగ్ ఇప్పటికే జరిగింది.

రాహుల్ సాంకృత్యాన్ విజయ్ దేవరకొండ కి ‘టాక్సీవాలా’ మూవీతో హిట్ ఇచ్చాడు. ఆ చిత్రం తర్వాత విజయ్ ఇప్పటి వరకు మరో విజయాన్ని అందుకోలేదు. రాహుల్ మాత్రం నానితో ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ చేసి సూపర్ హిట్ కొట్టాడు. దీని తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకొని రాహుల్ సాంకృత్యాన్ విజయ్ తో సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లబోతున్నాడు.

18వ శతాబ్దంలో నడిచే పీరియాడికల్ జోనర్ లో రాయలసీమ బ్యాక్ డ్రాప్ కథతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. నవంబర్ లో మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోందంట. హైదరాబాద్‌, అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్‌ జిల్లాల్లో ఈ మూవీ షూటింగ్ జరగనుందని తెలుస్తోంది.

ఇక రష్మిక మందన ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా కథాంశం ఉండబోతోందనే మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. రాహుల్ సాంకృత్యాన్ కథలు చెప్పే విధానం కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి కథలు తయారు చేసుకుంటాడు. వాటిని ప్రేక్షకులకి ఎంగేజ్ అయ్యే ఇంటరెస్టింగ్ డ్రామాతో తెరపై ఆవిష్కరిస్తారు.

విజయ్ తో చేయబోయే మూవీ కాన్సెప్ట్ కూడా అలాగే ఉండబోతోందని టాక్ నడుస్తోంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీని తర్వాత రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా చేయనున్నాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News