అడవి బుదరలో విజయశాంతి పోరాటం!
సన్నివేశం సహజత్వం కోల్పోకూడదని రిస్కీ షాట్లకు సైతం వెనకడుగు వేయని నటి.;

లేడీ సూపర్ స్టార్ విజయశాంతి యాక్షన్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఓ వెలుగు వెలిగిన నటి. యాక్షన్ సినిమాలు చేయాలంటే? విజయశాంతితో మాత్రమే సాధ్యమని నిరూపించిన నటి. ముఖ్యంగా కాఖీ స్టోరీల్లో లేడీ సూపర్ స్టార్ అప్పట్లో ఓ పెద్ద సంచలనం. తెరపై కాఖీ పాత్రలకే వన్నె తీసుకొచ్చిన నటి ఆమె. ఈ క్రమంలో యాక్షన్ సన్నివేశాల కోసం ఎలాండి డూప్ లేకుండా నటించేవారు.
సన్నివేశం సహజత్వం కోల్పోకూడదని రిస్కీ షాట్లకు సైతం వెనకడుగు వేయని నటి. అలా లేడీ సూపర్ స్టార్ గా అనతి కాలంలోనే పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆమె వయసు 60కి సమీపిస్తుంది. అయినా కూడా తగ్గేదేలే అంటూ `అర్జున్ సన్నాఫ్ వైజయంతి` చిత్రంలో నటించినట్లు తెలుస్తోంది. కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్నీ చిత్రంలో విజయ శాంతి కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా ప్రచారం కోసం విజయ శాంతి కూడా అంతే పవర్ పుల్ గానూ కనిపించారు. ప్యాంట్..షర్ట్ ధరించి సినిమాలో పాత్ర ఎలా ఉంటుందో హింట్ ఇచ్చే ప్రయత్నం చేసారు. ఈ సినిమాలో విజయ శాంతి వయసుతో సంబంధం లేకుండా యాక్షన్ సన్నివేశాల్లో నటించినట్లు దర్శకుడు ప్రదీప్ చిలుకూరి రివీల్ చేసారు. `ఎలాంటి డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాల్లో నటించారు. సినిమాలో అడివి నేపథ్యంలో ఓ ఎపిసోడ్ ఉంటుంది.
ఆ సీన్ కోసం విజయ శాంతి అడవిలో బురదలో రెండు గంటల పాటు అలాగే పడుకుని ఉండిపోయారు. ఆసీన్ పూర్తి చేసి కార్వాన్ లోకి వెళ్లాక ఆమెకు జ్వరం వచ్చింది. అయినా సరే ఆ సీక్వెన్స్ మొత్తం పూర్త య్యేవరకూ అక్కడ నుంచి కదల్లేదు. అంత డెడికేషన్ ఉన్న నటి ఆమె. సినిమా అంటే ఎంత ఇష్టమో మరోసారి అర్దమైంది. సినిమాలో కల్యాణ్ రామ్ తో పోటీ పడి నటించారని` అన్నారు.