విజయ్ దేవరకొండ.. దేనికదే డిఫరెంట్!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నుంచి చివరిగా వచ్చిన ఫ్యామిలీ స్టార్ మూవీ డిజాస్టర్ అయ్యింది.

Update: 2024-07-03 06:30 GMT

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నుంచి చివరిగా వచ్చిన ఫ్యామిలీ స్టార్ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఓ విధంగా చెప్పాలంటే విజయ్ కి టాక్సీవాలా మూవీ తర్వాత ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ హిట్ పడలేదు. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఖుషి ఏవరేజ్ టాక్ తో గట్టెక్కింది. సినిమాల పరంగా ఆశించిన స్థాయిలో సక్సెస్ లేకపోయిన విజయ్ స్టార్ ఇమేజ్ మాత్రం తగ్గలేదని చెప్పాలి. ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ తర్వాత కూడా దిల్ రాజు విజయ్ దేవరకొండతో మరో సినిమా కన్ఫర్మ్ చేశారు.

ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12 మూవీ షూటింగ్ జరుగుతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమా రెడీ అవుతోంది. మూవీలో విజయ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంట. ఇది సెట్ మీద ఉండగానే దిల్ రాజు బ్యానర్ లో రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మరో మూవీ ఎనౌన్స్ అయ్యింది.

ఈ మూవీ కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కనుందంట. అలాగే యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో రెడీ కాబోతున్న ఈ సినిమా గోదావరి నేపథ్యంలో ఉంటుందంట. విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కి కూడా గోదావరి యాసలోనే సంభాషణలు ఉంటాయంట. అలాగే టాక్సీవాలా తర్వాత మరోసారి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ జతకట్టబోతున్నాడు. ఈ మూవీ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో హిస్టారికల్ ఎలిమెంట్స్ తో ఉండబోతోందంట.

Read more!

పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ఈ చిత్రంలో ఉండనున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా ఖరారైందని తెలుస్తోంది. మూవీలో విజయ్ రాయలసీమ స్లాంగ్ లోనే మాట్లాడబోతున్నాడంట. రవి కిరణ్ కోలా, రాహుల్ సాంకృత్యాన్ ఇద్దరు విజయ్ ని సరికొత్త పాత్రలలోనే తమ సినిమాలలో చూపించబోతున్నారనే మాట వినిపిస్తోంది. ఇప్పటి వరకు విజయ్ ని మేగ్జిమమ్ సోషల్ కాన్సెప్ట్స్ లలోనే ప్రెజెంట్ జెనరేషన్ కథలలోని చూసారు.

నెక్స్ట్ రాబోయే మూడు పాన్ ఇండియా సినిమాలు కూడా పీరియాడిక్ జోనర్ లోనే ఉండబోతున్నాయి. ఈ సినిమాలు క్లిక్ అయితే విజయ్ దేవరకొండ ఫేమ్ అమాంతం పెరిగిపోతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎంత మంది ఎన్ని విధాలుగా ట్రోల్ చేసిన విజయ్ తన సినిమాల ద్వారానే సమాధానం చెప్పబోతున్నాడని ఫ్యాన్స్ అంటున్నారు. తాజాగా కల్కి 2898ఏడీ సినిమాలో అర్జునుడి పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించారు. ఈ పాత్ర ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యింది.

Tags:    

Similar News

eac