ఖుషి.. కావాలని టార్గెట్ చేశారా?
ఓ వైపు ఇండస్ట్రీని ఏలుతున్న స్టార్ హీరోలు, మరో వైపు గట్టి పోటీనిస్తున్న వారసులు.. వీరి మధ్య ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా, ఇండస్ట్రీలో ఎవరి సపోర్ట్ లేకుండా ఓ స్టార్‌గా ఎదగడమంటే మామూలు విషయం కాదు.
ఓ వైపు ఇండస్ట్రీని ఏలుతున్న స్టార్ హీరోలు, మరో వైపు గట్టి పోటీనిస్తున్న వారసులు.. వీరి మధ్య ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా, ఇండస్ట్రీలో ఎవరి సపోర్ట్ లేకుండా ఓ స్టార్‌గా ఎదగడమంటే మామూలు విషయం కాదు. చాలా అరుదుగా ఉంటారు ఇలాంటోళ్లు. అలాంటి వారిలో విజయ్ దేవరకొండ ఒకరు. అయితే ఈయనపై చాలాసార్లు నెగటివ్ ప్రచారం సాగుతూనే ఉంటుంది. ఖుషి సినిమాతో రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన విషయంలో తాజాగా మరోసారి ఇలాంటే ప్రచారమే మొదలైంది.
వివరాళ్లోకి వెళితే.. సినిమా అవకాశాల కోసం ఆఫీసుల చుటూ చెప్పులు అరిగేలా తిరిగి.. ఎన్నో ఆడిషెన్స్కు వెళ్లి.. పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి, ఫైనల్‌గా ఓ సినిమాలో హీరోగా ఛాన్స్ అందుని.. ఆ తర్వాత స్టార్‌గా ఎదిగారు విజయ్ దేవరకొండ. కెరీర్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ పాన్ ఇండియా రేంజ్లో స్టార్‌డమ్‌ను అందుకున్నారు. 'ఎవడే సుబ్రహ్మణ్యం'లో సైడ్ హీరోగా నటించిన ఆయన.. ఆ తర్వాత పెళ్లి చూపులు చిత్రంతో సోలో హీరోగా మారి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత 'అర్జున్ రెడ్డి' లాంటి కల్ట్ హిట్ సినిమాలో నటించి స్టార్‌డమ్‌ను అందుకున్నారు. ఈ విజయంతో దేవరకొండ పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. ఆ వెంటనే 'గీతా గోవిందం'తో టాలీవుడ్ మోస్ట్ డిమాండింగ్ స్టార్‌గా మారిపోయారు. వరుస అవకాశాలను దక్కించుకుంటూ కెరీర్లో దూసుకెళ్లారు.
అయితే ఎంత క్రేజ్ సంపాదించుకున్నప్పటికీ అదే స్థాయిలో కాంట్రవర్సీ హీరోగా కూడా మారారు. తన యాటిట్యూడ్, ఏ విషయమైనా ఓపెన్‌గా మాట్లాడటంతో ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. ఎన్నో సార్లు నెగటివిటీకి కూడా గురయ్యారు. రీసెంట్గా లైగర్ సమయంలోనూ ఆయన చూపించిన యాటిట్యూడ్, ఓవర్ కాన్ఫీడెన్స్ మస్త్ ట్రోలింగ్ అయింది.
కానీ ఇప్పుడు విజయ్‌లో చాలా మార్పు వచ్చింది. మాట్లాడే విధానం, వ్యవహరించే తీరులో మెచ్యూరిటీ వచ్చింది. కాంట్రవర్సీకి దూరంగా ఉండాలనుకున్నారో మరి ఏమో కానీ చాలా మారిపోయారు. కానీ విజయ్‌పై మాత్రం మళ్లీ నెగటివిటీ మొదలైంది. తాజాగా ఆయన ఖుషి సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు బుక్‌మై షోలో దాదాపు 10kకు పైగా ఫేక్ అకౌంట్స్ నుంచి 1/10 రేటింగ్స్ ఇచ్చారు. ఈ రేటింగ్స్ పబ్లిక్ అకౌంట్స్ నుంచి వచ్చి ఉంటే ఓకే.. కానీ ఇవన్నీ అన్ఐడెంటిఫైడ్ యూజర్స్ నుంచి వచ్చినవ్వే. కాబట్టి దీని బట్టి ఎవరో కావాలనే ఈ నెగెటివ్ కాంపైన్ చేస్తున్నారని అర్థమవుతోంది. మరి ఎవరు, ఎందుకు ఇంత నెగటివిటీ వ్యాప్తి చేయాలని చూస్తున్నారో అర్థం కావడం లేదు. ఏదేమైనా ఇలాంటి ప్రచారాన్ని నమ్మకుండా ఉండటమే మంచిది.