విజయ్ దేవరకొండ.. ఏం లైనప్ సామీ ఇది!

అంటే సుకుమార్, విజయ్ దేవరకొండ సినిమా స్టార్ట్ కావడానికి కనీసం 3-4 ఏళ్ళ సమయం పట్టొచ్చని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

Update: 2024-08-02 14:30 GMT

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నుంచి చివరిగా ఈ ఏడాది ది ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చి డిజాస్టర్ అయ్యింది. విజయ్ దేవరకొండ కెరియర్ లో లైగర్ తర్వాత బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ది ఫ్యామిలీ స్టార్ మూవీ మారింది. గత ఏడాది సమంతతో కలిసి చేసిన ఖుషి పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12 మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. రెండు భాగాలుగా ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. దీని తర్వాత VD14గా విజయ్ దేవరకొండ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు. పీరియాడికల్ జోనర్ లో రాయలసీమ బ్యాక్ డ్రాప్ కథతో ఈ సినిమా ఉండబోతోందంట. రష్మిక మందన్న ఈ చిత్రంలో విజయ్ కి జోడీగా నటించబోతోంది.

రవికిరణ్ కోలా దర్శకత్వంలో VD15 మూవీ విజయ్ దేవరకొండ ఇప్పటికే కన్ఫర్మ్ చేశాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు ఈ మూవీ కూడా పీరియాడికల్ జోనర్ కథాంశంతోనే ఉంటుందంట. నెక్స్ట్ VD 12 మూవీకి సీక్వెల్ ని గౌతమ్ తిన్ననూరి సెట్స్ పైకి తీసుకొని వెళ్లనున్నారు. ఇవన్నీ కంప్లీట్ అయ్యాక సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ VD16 మూవీ ఉంటుందని టాక్ వినిపిస్తోంది..

సుకుమార్ రామ్ చరణ్ తో చేయనున్న మూవీని కంప్లీట్ చేసాక విజయ్ దేవరకొండతో మూవీని స్టార్ట్ చేసే అవకాశం ఉందంట. అంటే సుకుమార్, విజయ్ దేవరకొండ సినిమా స్టార్ట్ కావడానికి కనీసం 3-4 ఏళ్ళ సమయం పట్టొచ్చని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇవి మాత్రమే కాకుండా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని విజయ్ ప్లానింగ్ లో ఉన్నారు. తరుణ్ భాస్కర్ తో మరో ఇంటరెస్టింగ్ కథతో సినిమా చేయాలని అనుకుంటున్నారు.

ఈ దర్శకులు కూడా విజయ్ తో సినిమాలు ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి తో చేస్తోన్న సినిమాపై విజయ్ దేవరకొండ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడంట. ఈ మూవీలో విజయ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ది ఫ్యామిలీ స్టార్ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ గ్యాప్ తీసుకోకుండా మూవీస్ అయితే చేస్తున్నాడు. అన్ని పాన్ ఇండియా లెవల్ లో యూనివర్సల్ కథలతోనే తెరకెక్కనుండటం విశేషం.

Tags:    

Similar News