ఆ స్టార్ హీరో కోసం మళ్లీ స్టార్ రైటర్ కలం!
ఇటీవలే మురగదాస్ తో కలిసి చేసిన `సికిందర్` కూడా కలిసి రాలేదు. దీంతో సల్మాన్ ఖాన్ మరోసారి విజయేంద్ర ప్రసాద్ పైనే ఆధారపడాల్సి వస్తోంది.;

స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ 'భజరంగ్ భాయిజాన్' తో హిందీ సినిమాలకు స్టోరీలు రాయడం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. 'భజరంగ్ భాయిజాన్' లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించగా కబీర్ ఖాన్ తెరకెక్కించి భారీ విజయం అందుకున్నారు. 75 కోట్ల బడ్జెట్ లో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 900 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అలా `భజరంగ్ భాయిజాన్` సల్మాన్ ఖాన్ కెరీర్ లో ఓ మైల్ స్టోన్ చిత్రంగా నిలిచిపోయింది.
ఆ తర్వాత `మణికర్ణిక` చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ అందించారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. అలా బాలీవుడ్ లోనూ స్టార్ రైటర్ గా విజయేంద్ర ప్రసాద్ సంచలన మయ్యారు. అయితే `భజరంగ్ భాయిజాన్` తర్వాత సల్మాన్ కి మళ్లీ ఆ రేంజ్ హిట్ పడలేదు. మధ్యలో చాలా సినిమాలు చేసాడు గానీ భాయిజాన్ రేంజ్ లో కలిసి రాలేదు. ఇటీవలే మురగదాస్ తో కలిసి చేసిన `సికిందర్` కూడా కలిసి రాలేదు. దీంతో సల్మాన్ ఖాన్ మరోసారి విజయేంద్ర ప్రసాద్ పైనే ఆధారపడాల్సి వస్తోంది.
తాజాగా `భజరంగ్ భాయిజాన్` సినిమాకి సీక్వెల్ తీసే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. పార్ట్ 2కి స్క్రిప్ట్ కి సంబంధించి సల్మాన్ ఖాన్ విజయేంద్ర ప్రసాద్ తో సంప్రదింపులు జరుపుతున్నారట. కొన్ని రోజుల క్రితమే ఈ ప్రక్రియ మొదలైందని తెలుస్తోంది. సీక్వెల్ తెరకెక్కించడానికి కబీర్ ఖాన్ కూడా సిద్దంగా ఉన్నట్లు తెలిసింది.
సల్మాన్ ఖాన్ కి బాలీవుడ్ రైటర్లు రాసిన కథలేవి కలిసి రాకపోవడంతోనే మరోసారి టాలీవుడ్ స్టార్ రైటర్ పై ఆధారపడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన రాసిన కథలు ఇప్పటికే పాన్ ఇండియాని షేక్ చేసిన సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ ని సైతం అల్లాడిస్తున్నాయ. ఈనేపథ్యంలోనే మరోసారి సల్మాన్ తెలివిగా స్టార్ రైటర్ ని బరిలోకి దించుతున్నారు.