DCM ని కలిసిన దర్శన్ వైఫ్..ఎందుకంటే?
ఇటీవలే జ్యూడీషయల్ రిమాండ్ ని కోర్టు మళ్లీ ఆగస్టు 1 వరకూ పొడిగించింది.
కన్నడ నటుడు దర్శన్ మర్డర్ కేసులో అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఆయన భార్య విజయలక్ష్మి బెయిల్ కోసం శతవిధాల ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. టాప్ క్లాస్ లాయర్లు అందరినీ రంగంలోకి దించి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇంతవరకూ బెయిల్ దొరకలేదు. ఇటీవలే జ్యూడీషయల్ రిమాండ్ ని కోర్టు మళ్లీ ఆగస్టు 1 వరకూ పొడిగించింది. దీంతో పరప్పన్ అగ్రహారం జైలులోనే ఉండాల్సిన పరిస్థితి.
అటు ప్రాధమిక విచారణ, సాక్ష్యాలు అన్నీ దర్శన్ కి ఏమాత్రం అనుకూలంగా లేవు. ఈ కేసులో శిక్ష తప్పదనే అంచనాలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయలక్ష్మి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకె. శివకుమార్ ని కలిసే ప్రయత్నం చేసారు. ఈ విషయాన్ని స్వయంగా శివకుమార్ మీడియా సమావేశంలో తెలిపి ఆశ్చర్య పరిచారు. తాను కేంపే గౌడ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో దర్శన్ భార్య విజయలక్ష్మి కలిసిందన్నారు. అప్పుడే `ఇక్కడ కాదు..ఇంటికి వచ్చి కలమని చెప్పాను.
దర్శన్ కేసు గురించి మాట్లాడుతారు అనుకున్నా! కానీ వారి కుమారుడు స్కూల్అడ్మిషన్ కోసం వచ్చారని` డీకే అన్నారు. అయితే డీకే ఇంటికి వెళ్లిన వారిలో దర్శన్ భార్యతో పాటు, సోదరుడు దినకర్, డైరెక్టర్ ప్రేమ్ కూడా ఉన్నారు. మీడియా సమావేశంలో దర్శన్ గురించి చర్చించలేదని, తనయుడు స్కూల్ అడ్మిషన్ గురించిప్ర స్తావించామని ప్రేమ్ అన్నారు. అలాగే విజయలక్ష్మి, దినకర్ మాత్రం ఏమాట్లాడారు? అన్నది నాకు కూడా తెలియదన్నారు ప్రేమ్.
అంతకు ముందే రామ్ నగర్ లో జరిగిన ఓకార్యక్రమంలో డీకే దర్శన్ కి అన్యాయం జరిగితే గనుక తప్పకుండా తనసహకారం ఉంటుందని వెల్లడించారు. ఆ తర్వాత విజయలక్ష్మి డీకేని కలవడం ఆసక్తికరంగా మారింది. దీంతో నిజంగా చర్చ కుమారుడి స్కూల్ అడ్మిషన్ గురించి జరిగిందా? దర్శన్ గురించి జరిగిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.