విజయ్ ఖాతాలో 70..71 కూడా ఉన్నాయా?
తలపతి విజయ్ తమిళనాడు రాజకీయాల్లోకి తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. 2026 ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించేసారు.
తలపతి విజయ్ తమిళనాడు రాజకీయాల్లోకి తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. 2026 ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించేసారు. దీంతో సినిమాలకు రిటైర్మెంట్ కూడా ఇచ్చేస్తానని వెల్లడించారు. ప్రస్తు తం సెట్స్ లో ఉన్న సినిమాతో పాటు మరో సినిమా చేసి సినిమాల నుంచి నిష్క్రమిస్తానని అన్నారు. ఇది అభిమానులు జీర్ణించుకోలేని వార్త అయినా తప్పని క్షణమిది. విజయ్ ని రాజకీయాల్లో చూడాలనుకుంటే? అభిమానులు కూడా కొన్నింటిని త్యాగం చేయకతప్పదు.
ప్రస్తుతం విజయ్ అభిమానులు రాజకీయాల్లోకి వస్తున్నాడని సంతోషపడాలా? సినిమాలు వదిలేస్తున్నా డని బాధపడాలో అర్ధం కాని డైలమాలోనూ కొందరు కనిపిస్తున్నారు. ఆ సంగతి పక్కనబెడితే విజయ్ చివరి సినిమా 69 అవుతుందా? లేక అక్కడ నుంచి మరో రెండు సినిమాలు పెరగడానికి అవకాశం ఉందా? అంటే ఉందనే తెలుస్తోంది. విజయ్ నుంచి రాజకీయ ప్రకటన అనేది అప్పటికప్పుడు జరిగిందా? ఓ ప్లానింగ్ ప్రకారం జరిగిందా? అన్నది పక్కనబెడితే విజయ్ లోకేష్ కి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉన్నట్లు తెలుస్తోంది.
వాళ్లిద్దరి కాంబినేషన్ లో రిలీజ్ అయిన `లియో` ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. దీంతో ఈ సినిమాకి సీక్వెల్ గా `లియో-2` కూడా ఉంటుందని ప్రచారం సాగింది. అదే ద్వయం భారీ ఎత్తున లియో-2 ని ప్లాన్ చేస్తున్నట్లు వినిపించింది. కానీ తాజా పరిస్థితుల్లో అది జరిగే పనికాదన్నది అంతే వాస్తవం. ఎల్ సీ యూ నుంచి విక్రమ్-2..ఖైదీ-2 కూడా రానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు చిత్రాల్లో విజయ్ గెస్ట్ రోల్ పోషిస్తున్నట్లు తాజా సమాచారం.
ఇప్పుడు తాను ఉన్న పరిస్థితుల్లో ఒక సినిమాకి పూర్తి స్థాయిలో కాల్షీట్లు కేటాయించడం కష్టంగానీ..గెస్ట్ రోల్ కి మాత్రం పెద్దగా ఇబ్బంది ఉండదు. ఈ నేపథ్యంలో లొకేష్ కొరిక మేరకు గెస్ట్ రోల్స్ ని ఒకే చేసినట్లు వినిపిస్తుంది. అదే జరిగితే విజయ్ ఖాతా కెరీర్ లో మరో రెండు సినిమాలు అదనంగా చేరినట్లే. ప్రస్తుతం విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో` ది గ్రెటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` సెట్స్ లో ఉన్న సంగతి తెలిసిందే.