విజయ్ మరో బిగ్ మూవీ.. రంగంలోకి అవతార్ టీమ్
తండ్రి పాత్రని సరికొత్తగా డిజైన్ చేయబోతున్నారంట. ఈ మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ పార్ట్ కూడా ఎక్కువగానే ఉంటుందని సమాచారం.
ఇళయదళపతి విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ లో దసరా కానుకగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తమిళ్ లో హైయెస్ట్ బిజినెస్ చేసిన మూవీగా రికార్డు సృష్టించింది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఈ మూవీ రాబోతోంది.
లియో రిలీజ్ తర్వాత విజయ్ 68 మూవీని స్టార్ట్ చేస్తాడు. ఇప్పటికే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యింది. పాన్ ఇండియా లెవల్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో విజయ్ తండ్రి కొడుకుల పాత్రలలో కనిపించనున్నాడంట. అయితే వీటిలో ఒక పాత్ర హీరోగా, మరో పాత్ర విలన్ గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.
తండ్రి పాత్రని సరికొత్తగా డిజైన్ చేయబోతున్నారంట. ఈ మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ పార్ట్ కూడా ఎక్కువగానే ఉంటుందని సమాచారం. వీటికోసం ప్రపంచంలో అత్యున్నత విఎస్ఎక్స్ టీమ్ లలో ఒకటైన USC ఇన్స్టిట్యూట్ ఫర్ క్రియేటివ్ టెక్నాలజీస్ తో పని చేయబోతున్నారంట. అవతార్, స్పైడర్ మెన్ 2, ది ఎవెంజర్స్, జంగిల్ బుక్ లాంటి హాలీవుడ్ సినిమాలకి వీరు విఎఫ్ఎక్స్ అందించారు.
ఫోటో డూప్లికెటింగ్ టెక్నాలజీలో వీరు పెర్ఫెక్ట్ గా వర్క్ చేస్తారంట. అందుకే వెంకట్ ప్రభు సైతం ఏరికోరి మరీ ఈ టీమ్ తో ఒప్పందం చేసుకున్నారు. తాజాగా దర్శకుడు USC ఇన్స్టిట్యూట్ ఫర్ క్రియేటివ్ టెక్నాలజీస్ వెక్కి అక్కడి ఫోటోలని ట్విట్టర్ లో పంచుకున్నారు. వాటికి వెల్ కమ్ టూ ఫ్యూచర్ అనే క్యాప్షన్ ఇచ్చారు. దీనిని బట్టి ఆ సంస్థతో విజయ్ 68 కోసం ఒప్పందం చేసుకున్నట్లు క్లారిటీ వచ్చింది.
ఈ సినిమాలో స్టార్ క్యాస్టింగ్ ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారంట. ఇతర భాషలకి సంబందించిన నటులు కూడా భాగమయ్యే అవకాశం ఉంది. సుమారు 300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా చేయబోతున్నారు. కస్టడీ లాంటి డిజాస్టర్ తర్వాత మరల తనకి అచ్చోచ్చిన మాతృభాషలోనే బ్లాక్ బస్టర్ కొట్టడానికి వెంకట్ ప్రభు సిద్ధం అవుతూ ఉండటం విశేషం.