విజయ్ 'మహారాజ' అదిరే రికార్డ్.. టాప్ చిత్రాలను వెనక్కినెట్టి!

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన మహరాజ మూవీ.. అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది.

Update: 2024-08-21 11:39 GMT

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి మహారాజ సినిమా ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. విజయ్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ 50వ చిత్రంగా వచ్చిన మహారాజ.. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. రూ.100 కోట్లకు పైగా వసూలు చేసిన ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు విజయ్ సేతుపతి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన మహరాజ మూవీ.. అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది.

నిథిలన్‌ సామినాథన్‌ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా.. జూన్‌ 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. సక్సెస్ ఫుల్ గా థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకుని 28 రోజుల తర్వాత పాపులర్ ఓటీటీ ప్లాట్‌ ఫాం నెట్‌ ఫ్లిక్స్‌ లోకి వచ్చేసింది. జులై 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. స్ట్రీమింగ్ అయిన ఫస్ట్ డే నుంచే సూపర్ రెస్పాన్స్ అందుకుంటోంది మహరాజ సినిమా. మైండ్ బ్లోయింగ్ వ్యూయర్ షిప్ ను సొంతం చేసుకుంటోంది. రీసెంట్ గా అరుదైన రికార్డును కూడా క్రియేట్ చేసింది.

నెట్‌ ఫ్లిక్స్‌ గ్లోబల్‌ చార్ట్స్‌ లో (జులై 8-14) నాలుగో స్థానంలో నిలిచి టాక్ ఆఫ్ ది టౌన్‌ గా మారిన మహారాజ మూవీ.. ఇప్పుడు మరో అరుదైన ఘనతను సాధించింది. ఓటీటీలోకి వచ్చి అనేక వారాలు అవుతున్నా.. టాప్ ట్రెండింగ్ లోనే కొనసాగుతోంది. ఇప్పుడు 2024లో నెట్ ఫ్లిక్స్ లో అత్యధిక మంది చూసిన సినిమాగా రికార్డు సాధించింది. 18.6 మిలియన్‌ వ్యూస్‌ తో స్పెషల్ ఫీట్ ను సొంతం చేసుకుంది. ఐదో వారంలో 1.8 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది.

2024లో నెట్ ఫ్లిక్స్ లో ఎక్కువ మంది సినిమాగా రికార్డు క్రియేట్ చేసిన మహరాజ.. సూపర్ హిట్ సినిమాలను వెనక్కి నెట్టి మరీ అదరగొట్టింది. ఇది వరకు ఆ రికార్డు.. క్రూ సినిమా పేరిట ఉండేది. ఇప్పుడు మహరాజ ఆ రికార్డ్ బ్రేక్ చేసింది. మహరాజ మూవీ తర్వాత స్థానాల్లో క్రూ (17.9 మిలియన్లు), లాపతా లేడీస్ (17.1 మిలియన్లు), సైతాన్ (14.8 మిలియన్లు), ఫైటర్ (14 మిలియన్లు), యానిమల్ (13.6 మిలియన్లు), డంకీ (10.8 మిలియన్లు) సినిమాలు ఉన్నాయి.

ఇక మహరాజ సినిమా విషయానికొస్తే.. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఆ చిత్రంలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, భారతీరాజా, అభిరామ్, సింగం పులి, వినోద్ సాగర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సీరియస్ రివెంజ్ డ్రామా కథను స్క్రీన్ ప్లేతో డైరెక్టర్ నిథిలన్ మ్యాజిక్ చేశారనే చెప్పాలి. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌ నాథ్‌ సూపర్ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందించారు. సుదన్ సుందరం, జగదీశ్ పళనిస్వామి సంయుక్తంగా నిర్మించారు.

Tags:    

Similar News