తనయుడిని నిరుత్సాహ పరుస్తున్న స్టార్ హీరో!
తలపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా లాంచ్ అవుతున్న సంగతి తెలిసిందే
తలపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా లాంచ్ అవుతున్న సంగతి తెలిసిందే. అగ్ర హీరో కుమారుడు తండ్రి వారతస్వాన్ని హీరోగా కొనసాగించకుండా దర్శకుడిగా బాధ్యతలు తీసుకోవడం అన్నది అభిమానులకు కాస్త షాకింగ్ అయినా! తప్పని విషయం. ప్రస్తుతం జాసన్ మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. దీన్ని లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.
అయితే కొడుకు దర్శకుడు అవుతోన్న వేళ తండ్రి పీల్డ్ లో లేకపోవడం అన్నది అభిమానుల్ని నిరుత్సాహ పరిచే అంశం అనే చెప్పాలి. విజయ్ మరోక్క సినిమా తీసి సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చేస్తానని ప్రకటించి న సంగతి తెలిసిందే. తమిళనాడు రాజకీయాల్లోకి ప్రవేశించడంతో రెండు పడవల ప్రయాణం సాధ్యం కాదని భావించిన విజయ్ సినిమాలకు పుల్ స్టాప్ పెట్టి 2026 ఎన్నికలకు సిద్దమవుతానని పార్టీ పెట్టి ప్రకటించారు. ప్రస్తతుం విజయం చేస్తోన్న సినిమాతో పాటు మరో సినిమా పూర్తి చేసి మ్యాకప్ కి దూరం అవుతారు.
అంటే సరిగ్గా అదే సమయానికి వారసుడు సినిమా సీన్ లోకి వస్తుంది. కానీ అప్పటి విజయ్ రాష్ట్ర రాజకీ యాల్లో బిజీగా ఉంటాడు. పవన్ కళ్యాణ్ లా పార్ట్ టైం పాలిటిక్స్ చేసి సినిమాలు చేయమని అభిమానులు కోరుతున్నా విజయ్ అందుకు ససేమీరా అంటున్నాడు. ఏపని చేసినా కమిట్ మెంట్ తో చేయాలి...సగం సగం కాదంటూ ముందుకెళ్తున్నాడు. కుమారుడు సినిమాల్లోకి వస్తున్నాడని ఇప్పుడు తన కోసం తాను వెయిట్ చేయడం అన్న దానిపై పెద్ద తప్పుగా భావిస్తున్నారు.
తనపని తనదని...నా పని నాది అంటూ విజయ్ ముందు ఓ ప్రణాళిక కనిపిస్తుంది. ప్రస్తుతం విజయ్ హీరోగా వెంటక్ ప్రభు దర్శకత్వంలో 'గ్రేటెస్ట్ ఆప్ ఆల్ టైమ్' అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ కి చేరుకుంటుంది. తదుపరి మరో సినిమా ప్రారంభించి పూర్తి చేసి ఇడస్ట్రీ నుంచి ఎగ్జిట్ కానున్నాడు.