విశ్వక్ డైరెక్టర్ తో విజయ్.. వ్వాటే ఛాన్స్!
దిల్ రాజు నిర్మాణంలో పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అసలైతే సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ షూటింగ్ పనులు ఆలస్యం కావడంతో సమ్మర్ కు షిఫ్ట్ చేశారు.
ఇక మొత్తానికి సినిమాను ఏప్రిల్ లో విడుదల చేయబోతున్నారు. అయితే మరోవైపు విజయ్ జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తో కూడా ఒక సినిమాను సెట్స్ పైకి తీసుకువచ్చాడు. ఈ సినిమా షూటింగ్ కూడా కొంతవరకు ఫినిష్ అయ్యింది. ఇక ఇవి షూటింగ్ దేశంలో ఉండగానే మరి కొన్ని ప్రాజెక్టులను ఒకే చేసే దిశగా విజయ్ అడుగులు వేస్తూ ఉన్నాడు.
రీసెంట్ రవి కిరణ్ కోలా అనే దర్శకుడు చెప్పిన కథకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. అతను ఇంతకుముందు రాజావారు రానివారు అనే సినిమా చేశాడు. అలాగే మరో టాలెంటెడ్ దర్శకుడికి కూడా విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. విశ్వక్ సేన్ తో అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమాను డైరెక్ట్ చేసిన విద్యాసాగర్ చింత చాలా రోజులుగా విజయ్ తో సినిమా చేయాలని అనుకుంటున్నాడు.
ఇక మొదట అతను దిల్ రాజు దగ్గరికి వెళ్లి కథ గురించి చెప్పగా వెంటనే విజయ్ డేట్స్ అడిగినట్లుగా తెలుస్తోంది. దాదాపు ఈ కాంబినేషన్ కూడా ఓకే అయినట్లు సమాచారం. దిల్ రాజు ఫ్యామిలీ స్టార్ ఫినిష్ అవ్వగానే విద్యాసాగర్ ప్రాజెక్టుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విజయ్ దేవరకొండ ఒకవైపు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటూనే మరొకవైపు యూత్ కి కనెక్ట్ అయ్యే కథలను కూడా సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాడు.
ప్రతి కథ రొటీన్ గా ఉండకుండా ఎంతో కొంత కొత్తగా ఉండేలా కూడా అతను జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాడు. ఇక ఇప్పుడు కొత్త దర్శకుడు విద్యాసాగర్ చెప్పిన కథ కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోనే రాబోతున్నట్లు సమాచారం. ఫ్యామిలీ స్టార్ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కూడా త్వరలోనే రాబోతున్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.