ప్రచారానికి స్టైలిష్ గా అతనొక్కడికే చెల్లింది!
సినిమా రిలీజ్ కి ముందు ప్రచార కార్యక్రమాల్లో స్టార్ హీరోలంతా పాల్గొంటారు. దర్శకుడు, హీరోయిన్ సహా ఇతర నటీనటులతో పాటు హీరో కూడా పాల్గొంటాడు.;

సినిమా రిలీజ్ కి ముందు ప్రచార కార్యక్రమాల్లో స్టార్ హీరోలంతా పాల్గొంటారు. దర్శకుడు, హీరోయిన్ సహా ఇతర నటీనటులతో పాటు హీరో కూడా పాల్గొంటాడు. ఏ సినిమా ప్రచారంలోనైనా అందరికంటే ఎక్కువగా హైలైట్ అయ్యేది కేవలం హీరో మాత్రమే. హీరో ఏం మాట్లాడుతున్నాడు? ఎలా మాట్లాడుతున్నాడు? అతడి లో స్పెషాల్టీ ఏంటి? అన్న దానిపైనే ప్రేక్షకుకాభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ విషయంలో హీరోలంతా ఒకే ఒరవడిలో కనిపిస్తుంటారు.
బాలీవుడ్..టాలీవుడ్...శాండిల్ వుడ్...మాలీవుడ్ ఇలా ఏ పరిశ్రమకు చెందిన హీరోను తీసుకున్నా? హీరో ప్రత్యేకంగా హైలైట్ అయ్యే ప్రయత్నం అంటూ కనిపించదదు. కానీ కోలీవుడ్ లో ఆ హీరో మాత్రం వెరీ డిఫరెంట్ అని చెప్పాలి. తన వైవిథ్యమైన చర్యతో సినిమా ప్రచారంలో కీలక భూమి పోషిస్తున్నాడు? అన్నది హైలైట్ అవుతుందిక్కడ. ఇంతకీ ఎవరా హీరో? ఏంటా ప్రత్యేకత అంటే? వివరాల్లోకి వెళ్లాల్సిందే.
చియాన్ విక్రమ్ ఆన్ స్క్రీన్ పై ఎంత స్టైలిష్ గా కనిపిస్తాడో? ఆఫ్ ది స్క్రీన్ లో నూ అంతే స్టైలిష్ గా హైలైట్ అవుతుంటాడు.
విక్రమ్ తాను నటించిన ఏ సినిమా ప్రచారానికి హాజరవ్వాలన్నా ఎంతో స్టైలిష్ గా అక్కడ కనిపిస్తుంటాడు. అతడు వేసుకునే బట్టల నుంచి హోయిర్ స్టైల్..షూస్..వాచ్ ...గ్లాసెస్ ప్రతీది స్టైలిష్ గా ఉంటుంది. అతడు ఇలా స్టైల్ గా ఉండటం అన్నదే సినిమాకి కోట్ల రూపాయల పబ్లిసిటీ తెచ్చి పెడుతుంది.ఆ ఈవెంట్ కి సంబంధించి ఫోటోల్లో విక్రమ్ ఫోటోలు సంథింగ్ స్పెషల్ గా నెట్టింట వైరల్ అవుతుంటాయి. నెటి జనుడు వాటిని ఒక్క క్షణం పాటు అలా ఆగి కళ్లర్పాకుండా చూస్తాడు.
ఇది ఎక్కడ? ఎప్పుడు దిగాడు? అనే విషయంలోకి వెళ్తే ఫలానా సినిమా ఈవెంట్ రోజు అనే విషయం బయట పడుతుంది. సినిమాలో కూడా అతడి పాత్ర ఇంతే స్టైలిస్ గా ఉంటుందా? అనే డిస్కషన్ కి సైతం ఛాన్స్ ఇస్తున్నాడు. భారతదేశంలో ఇంత స్టైలిష్ గా ప్రచారానికి హాజరయ్యే ఏకైక నటుడు విక్రమ్ మాత్రమే. అప్పుడప్పుడు కొంత మంది బాలీవుడ్ హీరోలు ట్రై చేస్తుంటారు. కానీ విక్రమ్ స్టైలింగ్ కాలేరు.