రెండు నెలలు ఏడుస్తూ కూర్చున్నా : విక్రమ్
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ఇప్పటి వరకు ఎన్నో విభిన్నమైన పాత్రలు, సినిమాలతో అలరించాడు.
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ఇప్పటి వరకు ఎన్నో విభిన్నమైన పాత్రలు, సినిమాలతో అలరించాడు. తన విలక్షణ నటనతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కించుకునన్ విక్రమ్ తాజాగా తంగలాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తంగలాన్ సౌత్ భాషలన్నింటిలో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుని, ఇటీవల హిందీలో కూడా డబ్ అయ్యింది. విక్రమ్ ఇతర హీరోల మాదిరిగా కాకుండా ప్రతి చోట కూడా ప్రమోషన్ చేసి ప్రేక్షకులకు తంగలాన్ ను చేరువ చేయడం జరిగింది. సాధారణంగా స్టార్ హీరోలు సినిమాలు విడుదల తర్వాత కనిపించకుండా పోతారు, కానీ విక్రమ్ మాత్రం ప్రమోషన్స్ కంటిన్యూ చేస్తున్నాడు.
పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా విక్రమ్ వరుసగా మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తంగలాన్ కి అన్ని భాషల నుంచి వస్తున్న రెన్సాన్స్ కి చాలా సంతోషంగా ఉంది. సినిమా కోసం పడ్డ కష్టం మొత్తం పాజిటివ్ టాక్ రావడంతో పోయినట్లు అయింది. దర్శకుడు పా రంజిత్ కథ చెప్పినప్పుడే తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందని భావించాను. యూనిట్ సభ్యులు మొత్తం కూడా చాలా కష్టపడ్డారు. భవిష్యత్తులో కూడా తన నుంచి మరిన్ని విభిన్న చిత్రాలు వస్తాయని విక్రమ్ అన్నారు.
మణిరత్నం దర్శకత్వంలో చేయాలని కెరీర్ ఆరంభం నుంచి నా డ్రీమ్. ఆయన ఫిల్మ్ మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఒక్క సినిమా అయినా ఆయన దర్శకత్వంలో చేసిన తర్వాత సినిమాల నుంచి తప్పుకున్నా పర్వాలేదు అనిపించేది. బొంబాయి సినిమా లో నాకు మొదట ఆఫర్ వచ్చింది. ఆ సినిమా కోసం నేను ఆడిషన్స్ కు వెళ్లాను. ఫైనల్ ఆడిషన్స్ లో నేను చేసిన తప్పుల వల్ల నాకు ఆ అవకాశం చేజారింది. ఆడిషన్స్ కు సడెన్ గా పిలిచారు. నా ముందు స్టిల్ కెమెరా పెట్టారు. యాక్టింగ్ చేయమని అంటే నాకు అర్థం కాలేదు. స్టిల్ కెమెరా ముందు ఎలా యాక్ట్ చేస్తాను అనుకుని, అలా నిల్చుండి పోయాను.
స్టిల్ కెమెరా కనుక నేను ఎక్కువ కదిలితే బ్లర్ వస్తుంది అనుకున్నాను. ఆ సమయంలో అంతా గందరగోళంగా అనిపించింది. అలా నా చేతి నుంచి సినిమా మిస్ అయ్యింది. బొంబాయి సినిమా లో నటించే అవకాశం చేజారడంతో రెండు నెలల పాటు ఏడుస్తూ కూర్చున్నాను. పొద్దున్నే లేవగానే ఆ విషయమే గుర్తుకు వచ్చి చాలా బాధ వేసేది. చాలా సార్లు ఆ బాధ నుంచి బయట పడేందుకు ప్రయత్నించాను. కానీ వీలు పడలేదు. ఏదో ఒక సమయంలో సినిమా మిస్ అయిన విషయం గుర్తుకు వచ్చి బాధ కలిగేది, కన్నీళ్లు వచ్చేవి. ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం కోసం మళ్లీ చాలా కాలం వెయిట్ చేయాల్సి వచ్చింది. చివరకు ఆయన దర్శకత్వంలో నటించానంటూ విక్రమ్ చెప్పుకొచ్చాడు.