తంగలాన్ ఓటీటీ సమస్య.. ఎందుకు ఈ ఆలస్యం?

ఇక అసలు వివరాల్లోకి వెళ్తే, తంగలాన్ మూవీ ఓటీటీ హక్కులను ఒక ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ ముందుగానే కొనుగోలు చేసినట్లు ప్రచారం జరిగింది.

Update: 2024-10-09 08:30 GMT

చియాన్ విక్రమ్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం "తంగలాన్". ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్ గా విడుదలై విమర్శకుల నుంచి మంచి స్పందనను పొందింది, అయితే కమర్షియల్ గా ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. తెలుగు మార్కెట్ లో మొదటి వారం డీసెంట్ వసూళ్లు రాబట్టడం కొంత ఊరటనిచ్చినా, తమిళనాడులో మాత్రం ఈ సినిమా యావరేజ్ వద్దే ఆగిపోయింది.

హిందీ మార్కెట్ లో అయితే ఈ సినిమాని డిజాస్టర్ గా పరిగణిస్తున్నారు. కర్ణాటక, కేరళ వంటి ప్రాంతాల్లో కూడా పెద్దగా స్పందన రాలేదు. తంగలాన్ వంటి పీరియాడిక్ విలేజ్ డ్రామాలు కేవలం థియేటర్లలో మాత్రమే కాకుండా, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో కూడా మంచి స్పందన రాబట్టే అవకాశం ఉంటుంది. డిజిటల్ స్ట్రీమింగ్ కోసం సినీ ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.

అయితే, సినిమా డిజిటల్ రిలీజ్ కు సంబంధించి కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. ఇంతకీ ఈ చిత్రం ఎప్పుడో ఓటీటీలోకి రావాల్సి ఉండగా, ఇంకా ఆలస్యం ఎందుకు జరుగుతోంది అనే విషయంలో రకరకాల రూమర్స్ వస్తున్నాయి. ఇక అసలు వివరాల్లోకి వెళ్తే, తంగలాన్ మూవీ ఓటీటీ హక్కులను ఒక ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ ముందుగానే కొనుగోలు చేసినట్లు ప్రచారం జరిగింది.

ఇంతలోనే, ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ అక్టోబర్ 20న విడుదల అవుతుందని కూడా ప్రకటించారు. కానీ అనూహ్యంగా ఆ తేదీ దగ్గరపడుతున్నా కూడా స్ట్రీమింగ్ ప్రారంభం కాకపోవడం సర్వత్రా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇప్పుడు అందుకు గల కారణం డీల్ లో ఏర్పడిన వివాదం అని చెన్నై వర్గాల సమాచారం. ఓటీటీ సంస్థ ఒక ధరకు హక్కులను అంగీకరించినా, సినిమా విడుదల తర్వాత ఆ సంస్థ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.

సినిమా పెద్దగా ఆడకపోవడంతో, పబ్లిక్ టాక్, రివ్యూలు నెగటివ్ గా ఉండడం వలన, ఒప్పందంలో ఉన్న ఒక క్లాజ్ ప్రకారం ఆ సంస్థ ఇప్పుడు ముందుగా అంగీకరించిన మొత్తాన్ని తగ్గించాలని కోరుతోంది. ఈ వ్యవహారం కారణంగా, తంగలాన్ స్ట్రీమింగ్ ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. ఓటీటీ సంస్థ ఇప్పటికీ తగిన రేటును సవరించాలని ఇస్తోన్న ప్రెజర్ వల్ల, సినిమా డిజిటల్ రిలీజ్ పూర్తిగా తాత్కాలికంగా వాయిదా పడింది.

ఒకవేళ మొదట ఒప్పందం కుదిరిన సంస్థ వెనక్కు తగ్గితే, వేరే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ తో సినిమా స్ట్రీమింగ్ కోసం తంగలాన్ నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్లు కూడా సమాచారం. ఈ పరిస్థితి స్టార్ హీరో విక్రమ్ లాంటి నటుడితో, భారీ బడ్జెట్ తో నిర్మించిన పాన్ ఇండియా చిత్రానికి అసలు అవసరమా? అని ఇండస్ట్రీ వర్గాలు చర్చిస్తున్నాయి. మొదటినుంచి సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, విడుదల తరువాత సినిమాకు అంత ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతోనే ఈ విధమైన సమస్యలు వస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News