ఆ బ్యానర్ లో విక్రమ్. కె 250 కోట్ల ప్రాజెక్ట్!
కోలీవుడ్ డైరెక్టర్ విక్రమ్. కె.కుమార్ భారీ ప్రాజెక్ట్ కి సన్నాహాలు చేస్తున్నాడా? తదుపరి చిత్రం పాన్ ఇండియాలోనే స్కెచ్ వేసాడా? అంటే అవుననే తెలుస్తోంది.
కోలీవుడ్ డైరెక్టర్ విక్రమ్. కె.కుమార్ భారీ ప్రాజెక్ట్ కి సన్నాహాలు చేస్తున్నాడా? తదుపరి చిత్రం పాన్ ఇండియాలోనే స్కెచ్ వేసాడా? అంటే అవుననే తెలుస్తోంది. విక్రమ్. కె నుంచి సినిమా రిలీజ్ అయి రెండేళ్లు దాటింది. ఆయన చివరిగా నాగచైతన్య హీరోగా `థాంక్యూ` తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా వాటిని అందుకోవడంలో విఫలైమైంది. ఆ తర్వాత విక్రమ్ ఇంతవరకూ సినిమా చేయలేదు.
సాధారణంగా ఆయన కథలు రాసుకోవడానికి, సెట్స్ కి వెళ్లిన తర్వాత పూర్తి చేసి రిలీజ్ చేయడానికి చాలా సమయం తీసుకుంటారు. స్టోరీ సహా నటీనటులు అంతా పర్పెక్ట్ గా కుదిరిన తర్వాతే సెట్స్ కు వెళ్తారు. మధ్యలో ఎలాంటి మార్పులు లేకుండా సినిమా చేయడం ఆయన స్పెషాల్టీ. ఈ ప్రోసస్ లోనే ఎక్కువ సమయం తీసుకుంటారు. ఈ నేపథ్యంలో 2025లో ఏకంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కే సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
250 కోట్ల బడ్జెట్ కథని విక్రమ్ సిద్దం చేసి పెట్టారుట. ఆ కథని నిర్మించడానికి మైత్రీ మూవీ మేకర్స్ తో చర్చలు జరుగుతున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్ కి ఇంకా హీరో సెట్ అవ్వలేదుట. ఓ పెద్ద స్టార్ ..పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న నటుడు నటించాల్సిన స్టోరీ అట ఇది. ఎంతో యూనిక్ గా ఉంటుందని... .యూని వర్శల్ గా కనెక్ట్ అవుతుందిట. విక్రమ్ మార్క్ స్క్రీన్ ప్లే టెక్నిక్ తో సాగే కథ అని అంటున్నారు.
ఈ చిత్రాన్ని తెలుగు హీరో గానీ, తమిళ హీరోతో గానీ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారుట. అయితే ఇక్కడ హీరో డేట్లు అన్నది కీలకం. ప్రస్తుతం తెలుగు పాన్ ఇండియా స్టార్లు అంతా చాలా బిజీగా ఉన్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ, ప్రభాస్ , మహేష్ వీళ్లంతా మరో రెండేళ్ల వరకూ డేట్లు కేటాయించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ తమిళ్ హీరో సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలా కాకుండా? విక్రమ్ అక్కినేని హీరోల్ని ఆప్షన్ గా తీసుకుంటారా? అన్నది చూడాలి. నాగార్జున, చైతన్య, అ్‌ఖిల్ తో విక్రమ్ కి మంచి స్నేహం ఉంది. ఆ ముగ్గురుతోనూ కలిసి పని చేసారు విక్రమ్. మరి ఆయన రాసుకున్న కథకు వాళ్లు సెట్ అవుతారా? అన్నది తెలియాలి.