మీరెంత తిట్టినా నా భార్య కాళ్లు మోక్కుతా!

భ‌ర్త శ్రేయ‌స్సు కోసం భార్యలంతా ఎంతో భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో ఉప‌వాసం ఉండి చేస్తారు.

Update: 2024-11-08 12:30 GMT

భ‌ర్త‌కు కాళ్ల‌కు భార్య న‌మ‌స్కారం చేయ‌డం అన్న‌ది సంస్కారం. మ‌రి భార్య కాళ్ల‌కే భ‌ర్త న‌మ‌స్కారం చేయ‌డాన్ని ఏమంటారు? అంతా దుమ్మెత్తి పోస్తారు. భార్య కాళ్ల‌కు భ‌ర్త న‌మ‌స్క‌రించ‌డం ఏంటి పిచ్చా..వెర్రా.లేక భార్య చాటు భ‌ర్త‌ అంటారు. ఇప్పుడు అలాంటి చీవాట్లే తింటున్నాడు బాలీవుడ్ న‌టుడు విక్రాంత్ మాస్సే. నార్త్ లో క‌ర్వాచౌత్ పండుగ ఎంత గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేస్తారో చెప్పాల్సిన ప‌నిలేదు. భ‌ర్త శ్రేయ‌స్సు కోసం భార్యలంతా ఎంతో భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో ఉప‌వాసం ఉండి చేస్తారు.

సాయంత్రం ఓ జ‌ల్లెడ లో భ‌ర్త ముఖం చూసి దీక్ష విర‌మిస్తారు. అదే స‌మ‌యంలో భ‌ర్త కాళ్ల‌కు భార్య‌లు న‌మ‌స్క రిస్తారు. అయితే ఓ భ‌ర్త విష‌యంలో ఇది రివ‌ర్స్ లో జ‌రిగింది. భార్య న‌మ‌స్క‌రించ‌డం కాదు. భ‌ర్తే భార్య కాళ్ల‌కు న‌మ‌స్క‌రించాడు. ఇంత‌కీ ఎవ‌రా భ‌ర్త అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. పండుగ రోజు విక్రాంత్ మాస్సే త‌న భార్య శీత‌ల్ ఠాకూర్ కాళ్ల‌కు న‌మ‌స్క‌రించాడు. దీంతో నెట్టింట ట్రోలింగ్ కి గుర‌య్యాడు.

ఇష్టాను సారం విక్రాంత్ ని ట్రోల్ చేస్తున్నారు. ర‌క‌ర‌కాల మీమ్స్ తో ఎగ బ‌డుతున్నారు. తాజాగా ఈ ట్రోలింగ్ పై విక్రాంత్ స్పందించాడు. `నేను చేసిన ప‌ని కొంద‌రికి న‌చ్చ‌లేదు. అందుకే వారంతా న‌న్ను బూతులు తిట్టారు. ఎందుక‌లా తిడుతున్నారో? నాకర్దం కాలేదు. భార్య కాళ్లు మొక్కితే ప్ర‌శాంతంగా అనిపిస్తుంది. అలా చేయ‌డం త‌ప్పు కాద‌ని నా అభిప్రాయం. నా భార్య నా ఇంటి మ‌హాల‌క్ష్మి. త‌ల్లి త‌ర్వాత భార్య మాత్ర‌మే త‌న బిడ్డ‌లా చూసుకుంటుంది.

అలాంటి దేవ‌త కాళ్లు తాక‌డంలో త‌ప్పేముంది. ప‌దేళ్ల క్రితం శీత‌ల్ నాజీవితంలోకి వ‌చ్చి ఎంతో అందంగా నా జీవితాన్ని మార్చింది. ఈ విష‌యాన్ని ఎక్క‌డైనా గ‌ర్వంగా చెప్ప‌గ‌ల‌ను. త‌ను వ‌చ్చాక నాకు జీవితంలో అంతా మంచే జ‌రిగింది. మీరెన్ని అనుకున్నా నా భార్య కాళ్లు మొక్కడం మాత్రం నేను ఆప‌ను. ఆ ప‌ని నేనెల్ల‌ప్పుడు చేస్తూనే ఉంటాను. మీ కామెంట్లు..ట్రోలింగ్ ల‌కు లొంగేవాడిని కాదు నేను` అని అన్నారు.

Tags:    

Similar News