'పీకే'తో పవర్ పుల్ స్టార్ వెబ్ సిరీస్!
తాజాగా ఈ యంగ్ హీరో బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ రాజ్ కుమార్ తో కలిసి వెబ్ సిరీస్ కి రెడీ అయ్యాడు.
బాలీవుడ్ యంగ్ హీరోల్లో విక్రాంత్ మాసే ఇప్పుడో సంచలనంగా మారాడు. ఇండస్ట్రీలో చాలా కాలంగా సినిమాలు చేసినా? ఈ మధ్య వరుస విజయాలతో అతడి పేరు మారుమ్రోగిపోతుంది. సౌత్ లోనూ బాగా వైరల్ అవుతున్నాడు. గత ఏడాది 'సెక్టార్ 36', 'సబర్మతి రిపోర్ట్' లాంటి భిన్నమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించాడు. తాజాగా ఈ యంగ్ హీరో బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ రాజ్ కుమార్ తో కలిసి వెబ్ సిరీస్ కి రెడీ అయ్యాడు. ఇప్పటి వరకూ రాజ్ కుమార్ వెబ్ సిరీస్ లు తెరకెక్కించలేదు.
తొలిసారి ఓ వెబ్ సిరీస్ రెడీ అయ్యారు. ఇందులో విక్రాంత్ ఎంపికయ్యాడు. ఇప్పటికే గోవాలో షూటింగ్ కూడా మొద లైనట్లు తెలుస్తోంది. సైబర్ క్రైమ్, కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్ ఇది. ఇందులో కూడా విక్రాంత్ విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం. దీంతో విక్రాంత్ కి విలన్ గా ఇది సెకెండ్ అటెంప్ట్ అవుతుంది. ఇప్పటికే విక్రాంత్ బాలీవుడ్ లో 'డాన్ -3'లో విలన్ గా ఎంపికైనట్లు వార్తలొస్తున్నాయి. రణవీర్ సింగ్ కథానాయకుడిగా పర్హాన్ అక్తర్ 'డాన్ -3' ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇందులో విలన్ పాత్రలకు కొంత మంది యంగ్ హీరోలను పరిశీలించి చివరిగా విక్రాంత్ ని లాక్ చేసినట్లు వార్త లొస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో రాజ కుమార్ సైతం తన వెబ్ సిరీస్ లో ప్రతి నాయకుడిగా తీసుకోవడం ఆసక్తికరం. ఈ రెండు సన్నివేశాలతో విక్రాంత్ మాసే బాలీవుడ్ లో ఎంత సంచలనమవుతున్నాడు? అన్నది అంచనా వేయోచ్చు. ప్రస్తుతం విక్రాంత్ హీరోగా 'ఆంఖోన్ కి గుస్తాకీ' చిత్రంలో నటిస్తున్నాడు.
ఇది షూటింగ్ దశలో ఉంది. అలాగే మరో రెండు చిత్రాలకు ఇటీవలే కమిట్ అయ్యాడు. వాటి వివరాలు తెలియాల్సి ఉంది. రాజ్ కుమార్ హిరాణీ డైరెక్టర్ తెరకెక్కించింది ఐదారు చిత్రాలే. కానీ అవి బాలీవుడ్ లో గొప్ప విజయాన్ని సాధించాయి. రైటర్ గా మంచి పేరుంది. ఈనేపథ్యంలో హిరాణీ వెబ్ సిరీస్ లకు ఎంటర్ అవ్వడంతో? అక్కడా తిరుగుండదనే అభిమానులు భావిస్తున్నారు.