విలన్ గా యంగ్ హీరో..స్టార్ హీరోతోనే ఢీ!
ఇప్పటికే ఓ ప్రాజెక్ట్ కి సైన్ చేసినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే రణవీర్ సింగ్ కథానాయకుడిగా పర్హాన్ అక్తర్ `డాన్ 3` చిత్రాన్ని భారీ ఎత్తున ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్ యంగ్ హీరోల్లో గట్టిగా వినిపిస్తోన్న పేరు విక్రాంత్ మాసే. ఇండస్ట్రీలో చాలా కాలంగా చాలా సినిమాలు చేసినా? ఈ మధ్యన వరుస విజయాలతో అతడి పేరు మారుమ్రోగిపోతుంది. సౌత్ లోనూ బాగా వైరల్ అవుతున్నాడు. గత ఏడాది `సెక్టార్ 36`, `సబర్మతి రిపోర్ట్` లాంటి భిన్నమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించాడు. ప్రస్తుతం హీరోగా చేతిలో కొన్ని ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో యంగ్ హీరో అప్పుడే విలన్ గా మారడానికి రెడీ అవుతున్నాడు.
ఇప్పటికే ఓ ప్రాజెక్ట్ కి సైన్ చేసినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే రణవీర్ సింగ్ కథానాయకుడిగా పర్హాన్ అక్తర్ `డాన్ 3` చిత్రాన్ని భారీ ఎత్తున ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో రణవీర్ కి జోడీగా కియారా అద్వాణీ ని హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఇందులో విలన్ పాత్ర హీరో పాత్ర తరహాలో అంతే బలంగా ఉంటుంది. ఈనేపథ్యంలో ఆ పాత్రకు ఏ నటుడిని ఎంపిక చేస్తారు? అని డాన్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆ పాత్రకు యంగ్ హీరో విక్రాంత్ మాసేని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రణవీర్ ని ఢీ కొట్టే బలమైన పాత్ర ఇది అని అంటున్నారు. ఇటీవలే పర్హాన్ తో విక్రాంత్ చర్చలు ముగిసాయట. త్వరలోనే విక్రాంత్ పాత్రకు సంబంధించి ట్రైనింగ్ కి హాజరవుతాడుట. అటుపై టీమ్ తో జాయిన్ అవుతాడని తెలుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలైందా? లేదా? అన్నది పెద్ద మిస్టరీగానూ మారింది. సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే షూటింగ్ మొదలైందని కొందరంటే? జూన్ నుంచి మొదలవుతుందని మరికొంత మంది ప్రచారం చేస్తున్నారు. దీనిపై పర్హాన్ అక్తర్ కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఆ మధ్య కశ్మీర్ లో ఆయన మరో సినిమా పనుల్లో బిజీగా ఉంటే? `డాన్ 3` షూటింగ్ అంటూ ప్రచారంలోకి వచ్చింది. కట్ చేస్తే అది మరో సినిమా అని తేలింది.