చంపేస్తామంటూ యంగ్ హీరోకి బెదిరింపు!
మొన్న సల్మాన్ ఖాన్...నిన్న షారుక్ ఖాన్ వరుస బెదిరింపులతో బాలీవుడ్ లో? ఏం జరుగుతోందో అర్దం కాని పరిస్థితి నెలకొంది.
బాలీవుడ్ బెదిరింపులతో అట్టుడుకుతోంది. మొన్న సల్మాన్ ఖాన్...నిన్న షారుక్ ఖాన్ వరుస బెదిరింపులతో బాలీవుడ్ లో? ఏం జరుగుతోందో అర్దం కాని పరిస్థితి నెలకొంది. గ్యాంగ్ స్టర్స్ బెదిరింపుల నేపథ్యంలో ఇల్లు దాటి బయటకు వెళ్లాలంటే? ఒణికిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఏ పని చేయాలన్నా కట్టుదిట్టమైన భద్రతా వలయం మధ్య పని చేయాల్సిన పరిస్థితులు దాపరించాయి. వరుస బెదిరింపులో ముంబై మళ్లీ మాఫియా గుప్పిట్లోకి వెళ్లిపోతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సల్మాన్ ఖాన్ ని బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరించిన తర్వాత 5 కోట్లు ఇస్తే వదిలేస్తామని మరో బెదిరింపు ..సరిగ్గా ఇదే తరహాలో షారుక్ ఖాన్ ని రెండు కోట్లు ఇవ్వాలని లేకపోతే లేపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి మరో కాల్ వచ్చింది. షారుక్ ఖాన్ కంటే ముందే బిగ్ బాస్ విన్నర్ మున్నావర్ ఫరుఖీని కూడా చంపేస్తామని బెదిరించడంతో అతడికి సైతం పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. తాజాగా యంగ్ హీరో విక్రాంత్ మాస్సేకి సైతం బెదిరింపులు తప్పలేదు.
విక్రాంత్ మాస్సే ని చంపేస్తామంటూ బెదిరింపు వచ్చిందని స్వయంగా తానే తెలిపాడు. ఆయన హీరోగా నటిస్తోన్న ‘ది సబర్మతి రిపోర్ట్’ ట్రైలర్ లాంచ్ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించాడు. అయితే విక్రాంత్ ని బెదిరించింది డబ్బుల కోసమా? లేక తాను నటిస్తోన్న `ది సబర్మతి రిపోర్ట్` సినిమా విషయంలోనా? అన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు. సబర్మతి రిపోర్ట్ గుజరాత్ లో జరిగిన గోద్రా రైలు దహనకాండను ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు.
దేశవ్యాప్తంగా అప్పట్లో ఎంత సంచలనమైన సంఘటన ఇది. ఎంతో మంది జీవితాల్ని...రాతల్ని ఘటన ఇది. ప్రపంచానికి తెలియని వాస్తవాలు తమ సినిమా ద్వారా తెలియజేస్తున్నాం అంటూ చిత్ర యూనిట్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. దీంతో ఈ బెదిరింపుల్లో రాజకీయ కోణం ఏదైనా ఉందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.