బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న విలేజ్ కథలు
టాలీవుడ్ లో విలేజ్ కథలు అంటే ఎక్కువగా ఫ్యామిలీ డ్రామా లేదంటే కామెడీ కథలు కనిపించేవి.
టాలీవుడ్ లో విలేజ్ కథలు అంటే ఎక్కువగా ఫ్యామిలీ డ్రామా లేదంటే కామెడీ కథలు కనిపించేవి. అయితే ఈ మధ్యకాలంలో గ్రామీణ నేపథ్యంలో ఎక్కువ థ్రిల్లర్ జోనర్ మూవీస్ వస్తున్నాయి. గతంలో వంశీ ‘అన్వేషణ’ అనే సినిమాని విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చేశారు. ఇది పూర్తిగా క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో ఉంటుంది. మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తరువాత అలాంటి కథలు ఎవరు చేసే ప్రయత్నం చేయలేదు.
ఇదిలా ఉంటే ఇప్పుడు మరల థ్రిల్లర్ జోనర్ కథల ట్రెండ్ నడుస్తోంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అది కూడా విలేజ్ సేటప్ తో ఆకట్టుకుంటున్నాయి. ఆడియన్స్ రెగ్యులర్ కథలని చూడటానికి పెద్దగా ఇష్టపడటం లేదు. సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో నెక్స్ట్ ఎం జరుగుతుందో కూడా గెస్ చేయలేని కాన్సెప్ట్ లని కోరుకుంటున్నారు. అలాంటి కథతో సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు. అలాగే సత్యం రాజేష్ ‘పొలిమేర’ 1, 2 సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే.
సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’ మూవీ కూడా అలాంటి మిస్టరీ కథతో వచ్చిందే. విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ మూవీ ఉంటుంది. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంగళవారం’ విలేజ్ క్రైమ్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా రిలీజ్ అయిన కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ కూడా విలేజ్ నేపథ్యంలోనే థ్రిల్లర్ జోనర్ లో వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
ఈ సినిమాలు చూస్తుంటే గ్రామీణ నేపథ్యంలో మిస్టీరియస్ థ్రిల్లర్ కథలని చూడటానికి ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని అర్ధమవుతోంది. గ్రామీణ నేపథ్యం, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ అంటే సహజంగానే మిస్టీరియస్ ఫీల్ ఉంటుంది. అడవుల్లో వినిపించే భయానక శబ్దాలు డిఫరెంట్ మూడ్ క్రియేట్ చేస్తాయి. అలాంటి వాతావరణంలో సస్పెన్స్ తో కూడిన కథలు చెబితే ఆటోమేటిక్ గా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు.
గ్రామీణ ఆచారాలు, సంప్రదాయాలని కూడా కథలలో భాగంగా చూపించడం ద్వారా వాటిపై ప్రేక్షకులు ప్రత్యేక ఆసక్తి చూపిస్తారు. అందుకే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ట్ థ్రిల్లర్ కథలు మంచి సక్సెస్ ని అందుకుంటున్నాయి. ఈ ట్రెండ్ ని మరికొంతకాలం టాలీవుడ్ దర్శకులు కొనసాగించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో భావిస్తున్నారు.