విమలా రామన్ ప్రేమలో పడిందా..?
తెలుగు చల చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్స్ ఎంట్రీ ఇచ్చారు.. కొందరు దశాబ్దాల కాలంగా అలరిస్తూ ఉంటే కొందరు ఇలా వచ్చి అలా వెళ్లిన భామలు ఉన్నారు.
ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే హీరోలకు ఉన్నంత కెరీర్ స్పాన్ హీరోయిన్స్ కు ఉండదు. ఎంత టాలెంట్ ఉన్నా సరే హీరోయిన్స్ మహా అయితే ఒక పదేళ్లు సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగిస్తారు. ఆ తర్వాత ఫేడవుట్ అవ్వక తప్పదు. ఇంకా మరీ ఎక్కువ ఉన్నా ఏవో ప్రయోగాలు చేస్తూ ఉండటమే తప్ప కమర్షియల్ సినిమాల్లో నటించే అవకాశం ఉండదు. తెలుగు చల చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్స్ ఎంట్రీ ఇచ్చారు.. కొందరు దశాబ్దాల కాలంగా అలరిస్తూ ఉంటే కొందరు ఇలా వచ్చి అలా వెళ్లిన భామలు ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు విమలా రామన్.
క్లాసికల్ డ్యాన్సర్ అయిన విమలా రామన్ ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగినా ఇండియన్ సినిమాల మీద ఆసక్తి పెంచుకుంది. 2009 లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అమ్మడు హీరోయిన్ గా కొన్నాళ్లు లాక్కొస్తుందని అనుకున్నారు కానీ ఆ ఛాన్స్ లేకుండాపోయింది. హీరోయిన్ గా చేసిన సినిమాలేవి ఆడకపోవడంతో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చింది. చిన్నగా ఆ ఛాన్స్ లు కూడా రావడం మానేశాయి.
అయితే లేటెస్ట్ గా అశ్విన్స్, గాండీవధారి అర్జున, రుద్రాంగి 3 సినిమాల్లో నటించింది విమలా రామన్. ఆ సినిమాలు కూడా ప్రేక్షకాదరణ పొందలేదు. 41 ఏళ్ల ఈ అమ్మడు ఇంకా పెళ్లి చేసుకోలేదు. నటుడు వినయ్ రాయ్ తో కొన్నాళ్లుగా ప్రేమలో ఉందన్న వార్తలు వస్తున్నాయి. ఇద్దరు కలిసి ఫోటోలు పెడుతూ తమ ప్రేమ వ్యవహారాన్ని చెప్పకనే చెబుతున్నారు. ఇన్ స్టాగ్రాం లో వినయ్ రాయ్ తో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ తమ రిలేషన్ షిప్ ని కన్ఫర్మ్ చేస్తుంది అమ్మడు. సినిమాలు చేతిలో లేకపోయినా ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తుంది విమలా రామన్.
మరి ప్రియుడితో పెళ్లి విషయంలో అయినా తొందర పడుతుందా లేక కొన్నాళ్లు ఆగుతుందా అన్నది చూడాలి. అమ్మడు తెలుగు సినిమాల్లో పరిచయమైన టైం లో స్టార్ హీరోయిన్ గా అయ్యే అవకాశాలు ఉన్నాయని అనుకున్నారు. కానీ కథల ఎంపిక సినిమాల ఫలితాలు విమలా రామన్ కెరీర్ గ్రాఫ్ పడిపోయేలా చేశాయి. పెళ్లైనా కూడా ప్రత్యేక పాత్రలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి విమలా రామన్ పెళ్లి తర్వాత సినిమా ఛాన్స్ లు వచ్చినా సరే చేస్తుందని చెప్పొచ్చు.