వినాయక్ సినిమా.. ట్విస్ట్ ఏంటంటే!
ఖైదీ నెం.150 తర్వాత వినాయక్ స్పీడ్ మళ్లీ పెరుగుతుందని అంతా భావించారు.
చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్ తో పాటు ఎంతో మంది స్టార్ హీరోలతో సినిమాలు చేసిన యాక్షన్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్. యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్, బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లుగా నిలిచిన వినాయక్ ఈ మధ్య కాలంలో సినిమాలు ఏమీ చేయక పోవడంతో ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు.
ఖైదీ నెం.150 తర్వాత వినాయక్ స్పీడ్ మళ్లీ పెరుగుతుందని అంతా భావించారు. కానీ వినాయక్ జోరు కంటిన్యూ అవ్వలేదు. హిందీలో చత్రపతి సినిమా తో మరింతగా ఢీలా పడ్డాడు. తెలుగు లో వినాయక్ దర్శకత్వంలో సినిమా ఉండదేమో అని అంతా అనుకుంటూ ఉన్నారు.
ఇలాంటి సమయంలో వినాయక్ నుంచి సినిమా రాబోతుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఆయన దర్శకత్వంలోనో.. లేదా దర్శకత్వంలోనో కాకుండా నిర్మాణంలో సినిమా రాబోతుంది. కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చేందుకు వినాయక్ రెడీ అవుతున్నాడు.
తన బ్రాండ్ ఇమేజ్ ను వినియోగించి బ్యాక్ టు బ్యాక్ చిన్న సినిమాలను నిర్మించి పెద్ద విజయాలను సొంతం చేసుకోవాలని ఈ యాక్షన్ చిత్రాల దర్శకుడు భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వినాయక్ నిర్మాణంలో సినిమా ఈ ఏడాదిలోనే ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
నిర్మాణంతో పాటు దర్శకత్వం కూడా చేయాలని వినాయక్ కోరుకుంటున్నాడు. అయితే పెద్ద దర్శకులతో అవకాశం వస్తేనే సినిమాను మొదలు పెట్టాలని వినాయక్ భావిస్తున్నాడట. అందుకు గాను చర్చలు జరుగుతున్నాయని కూడా సమాచారం అందుతోంది.