కారవ్యాన్ నుంచి మాయమై కోటి నష్టం తెచ్చిన నటుడు?
ఇటీవల తిరుపతి లడ్డూ వ్యవహారంపై పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నిస్తూ వార్తల్లో నిలిచారు ప్రకాష్ రాజ్.
ఇటీవల తిరుపతి లడ్డూ వ్యవహారంపై పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నిస్తూ వార్తల్లో నిలిచారు ప్రకాష్ రాజ్. సామాజిక కాజ్ తో అతడు ఏదో ఒక విషయంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇప్పుడు జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్లు పవన్ ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పించాయి. అయినా అతడు తన పంథాను వీడలేదు. తమిళనాడు కొత్త ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో సాన్నిహిత్యానికి సంబంధించిన ఫోటోను షేర్ చేసిన ప్రకాష్ రాజ్ సనాతనాన్ని వ్యతిరేకిస్తూ సమానత్వాన్ని అనుసరిస్తానని చెప్పాడు. పవన్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రకాష్ రాజ్ ఉదయనిధితో అంటకాగుతున్నాడు. పైగా పవన్ సిద్ధాంతాలపై ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నాడు.
అయితే ప్రకాష్ రాజ్ ట్వీట్లకు కొందరు తమిళ నిర్మాతల నుంచి వ్యతిరేకత నెలకొంది. నిర్మాత వినోద్ కుమార్ ప్రకాష్ రాజ్‌కి వ్యంగ్య సమాధానం ఇచ్చారు. ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ డిపాజిట్ కోల్పోయాడని, తనకు సమాచారం ఇవ్వకుండానే తన సెట్స్ కారవాన్ నుంచి అదృశ్యమవ్వడంతో.. కోటి రూపాయల నష్టం వాటిల్లిందని అన్నారు.
మీతో కూర్చున్న ముగ్గురు వ్యక్తులు ఎన్నికల్లో గెలిచారు కానీ మీరు డిపాజిట్ కోల్పోయారు.. మీ వల్ల నాకు కోటి నష్టం. మాకు తెలియజేయకుండా కారవాన్ నుండి అదృశ్యమయ్యారు! కారణం ఏమిటి?! #జస్ట్ ఆస్కింగ్ !! మీరు కాల్ చేస్తారని చెప్పారు.. కానీ మీరు అలా చేయలేదు! అని వినోద్ సెటైర్ వేసాడు.
అయితే ఈ సెటైర్ పై ప్రకాష్ రాజ్ స్పందించాల్సి ఉంది. వినోద్ కుమార్ గతంలో శత్రువు, పోయికల్ కుతిరై, మార్క్ ఆంటోని చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం నిర్మిస్తున్న చిత్రంలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రను పోషిస్తున్నారు. కానీ సెట్ నుంచి మాయమై కోటి నష్టం మిగిల్చారనేది వినోద్ వాదన.