బేబీ క్రేజ్ కలిసి రాలేదా..?

అంతకుముందు అతను చేసిన ప్రయత్నాలన్నీ కూడా అతనికి పెద్దగా గుర్తింపు తీసుకు రాలేదు కానీ బేబీ వల్ల అతను ఆడియన్స్ కు దగ్గరయ్యాడు.

Update: 2023-12-16 15:50 GMT

బేబీ సినిమాతో హీరో ఆనంద్, హీరోయిన్ వైష్ణవి చైతన్యతో పాటుగా అందులో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన విరాజ్ అశ్విన్ కి కూడా మంచి పాపులారిటీ వచ్చింది. అంతకుముందు అతను చేసిన ప్రయత్నాలన్నీ కూడా అతనికి పెద్దగా గుర్తింపు తీసుకు రాలేదు కానీ బేబీ వల్ల అతను ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. బేబీ వల్ల విరాజ్ కి లీడ్ రోల్స్ కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే విరాజ్ అశ్విన్ హీరోగా అను ప్రసాద్ దర్శకత్వంలో జోరుగా హుషారుగా సినిమా వచ్చింది.

విరాజ్ అశ్విన్ కి జోడీగా పూజిత పొన్నాడ హీరోయిన్ గా నటించింది. ఇక సినిమా కథ విషయానికి వస్తే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయిన సంతోష్ (విరాజ్ అశ్విన్) కుటుంబ బాధ్యతల వల్ల ఓ కంపెనీలో జాబ్ చేస్తుంటాడు. మిడిల్ క్లాస్ మెన్ కి ఉండే అప్పుల తిప్పలతో లైఫ్ లాగిస్తుంటాడు విరాజ్. అయితే ఆఫీస్ లో తన టీం లీడర్ గా తన ఫ్రెండ్ నిత్య (పూజిత పొన్నాడ) కనిపిస్తుంది. ఇక ఆఫీస్ లో బ్యాచిలర్ బాస్ ఆనంద్ (మధునందన్)కి అమ్మాయిలను ప్రేమించడం ఎలా అనే టిప్స్ చెబుతుంటాడు. ఆనంద్ నిత్యని ఇష్టపడుతుండటం తో అసలు కథ మొదలవుతుంది. ఇక ఆ టైం లో విరాజ్, నిత్యలు ఏం చేశారు మిగిలిన కథ ఎలా నడిచింది అన్నది సినిమా.

అను ప్రసాద్ ఒక రొటీన్ రెగ్యులర్ కథతోనే ఈ సినిమా తీశారు. అయితే జోరుగా హుషారుగా అంటూ టైటిల్ పెట్టి పాత కథనే చెప్పినా కథనం అయినా కాస్త కొత్తగా ఉంటే బాగుండేది. అది కూడా ఏమాత్రం ఆకట్టుకోలేదు. సినిమా అంతా సాగదీసినట్టు అనిపిస్తుంది. కామెడీ కూడా అంతగా ఇంప్రెస్ చేయలేదు. ఫైనల్ గా దర్శకుడు అను ప్రసాద్ అన్ని విభాగాల్లో ప్రేక్షకులకు చేరవేయడంలో విఫలమయ్యారు.

ఒక హిట్ పడిన తర్వాత వెంటనే అవకాశాలు రావడం కామనే. కానీ అలాంటి టైం లోనే కంటెంట్ మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. బేబీ తో తనకు వచ్చిన ఈ క్రేజ్ ని ఏం చేసినా ఆడియన్స్ చూస్తారు అన్న విధంగా ఈ సినిమా చేసినట్టు ఉన్నాడు విరాజ్ అశ్విన్. కథ రొటీన్ గా ఎంచుకున్నా కథనం అయినా కొత్తగా ట్రై చేస్తే ఆడియన్స్ ఇంప్రెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. జోరుగా హుషారుగా సినిమా విషయంలో ఏది అంతగా వర్క్ అవుట్ కాలేదు.

Tags:    

Similar News