పదేళ్ల తర్వాత రిలీజైనా వర్కవుటైంది
విశాల్ నటించిన `మదగజరాజా` ఈ ఆదివారం థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.
విశాల్ నటించిన `మదగజరాజా` ఈ ఆదివారం థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా తెరకెక్కిన దాదాపు పదేళ్ల తర్వాత ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2012లోనే పూర్తయింది. కానీ రకరకాల ఆర్థిక కష్టాలతో విడుదల డిలే అయింది. ఎట్టకేలకు అన్ని కష్టాల నుంచి గట్టెక్కి నిన్ననే విడుదలైంది.
ఈ సినిమా ఇన్నేళ్ల తర్వాత వచ్చినా ఇందులో కామెడీ, థ్రిల్స్, విజువల్ బ్రిలియన్సీ ఆకట్టుకున్నాయన్న ప్రశంసలు దక్కాయి. సినిమా చూసిన తర్వాత చాలా మంది ప్రేక్షకులు దర్శకుడు సుందర్.సిని మెచ్చుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత కూడా ఇది ఫేడవుట్ అవ్వలేదు. ఈ చిత్రంలో కామెడీ బాగానే వర్కవుటైంది. కొన్ని అతిశయోక్తి సన్నివేశాలు ఉన్నా కానీ, కమర్షియల్ గా ఆకట్టుకునే ఎలిమెంట్స్ తో సినిమా రక్తి కట్టించిందని చాలా మంది ప్రశంసించారు.
కోలీవుడ్ లో అన్ని కమర్షియల్ అంశాల కలయికతో సినిమాలు తీసేవారు తగ్గిపోయారు. సుందర్ సి లాంటి ప్యాకేజీ దర్శకులకు ఇది కలిసొస్తోంది. తమిళ సినిమా మనుగడలో కమర్షియల్ సినిమా ఫార్మాట్‌లో వెళుతున్న అరుదైన దర్శకుడిగా సుందర్ సి కి మంచి గుర్తింపు ఉంది. అతడు తెరకెక్కించిన చివరి చిత్రం ఆరణ్మనై 4 బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. మదగజరాజాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ విజయాలతో సుందర్ సి తమిళ సినిమా వాస్తవ ముఖం అని సోషల్ మీడియాలో ప్రజలు ప్రశంసిస్తున్నారు. మాస్ కమర్షియల్ సినిమాను బలమైన వినోదాత్మక కంటెంట్‌తో మిళితం చేయగల అరుదైన దర్శకుగా అతడి గుర్తింపును మరోసారి రిమైండ్ చేస్తున్నారు.