ఆ హీరోలిద్దరికీ పోటీగా మరో హీరో పార్టీ!
ప్రత్యర్ధికి బలమైన పోటీగా విజయ్ ని ప్రత్యామ్నాయంగా అక్కడి ప్రజలు భావిస్తున్నారు.
ఇప్పటికే స్టాలిన్ వారసుడిగా ఉదయనిధి స్టాలిన్ రంగంలోకి దిగేసాడు. తాతయ్య కరుణానిధి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని స్టాలిన్ తెరపైకి వస్తే..అతని వారసత్వాన్ని కనసాగించడానికి తనయుడు రంగంలోకి దిగేసాడు. ఇదే సరైన సమయంగా భావించి తలపతి విజయ్ కూడా కొత్తగా `తమిళక వెట్రి కజగం` అనే పార్టీని స్థాపించాడు. 2026 ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నాడు. మరో రెండు సినిమాలు చేసి రిటైర్మెంట్ సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చేస్తానని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. విజయ్ ఎంట్రీతో తమిళనాడు రాజకీయాలు మారుతాయని మీడియా కథనాలు అంతకంతకు వెడెక్కిస్తున్నాయి.
ప్రత్యర్ధికి బలమైన పోటీగా విజయ్ ని ప్రత్యామ్నాయంగా అక్కడి ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నటుడు విశాల్ కూడా 2026 లో తాను తగ్గేదేలేదని సంచనల ప్రకటన ఇచ్చేసాడు. రాజకీయాల్లోకి తప్పకుండా వస్తానని..2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీతో పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. సేలం అమ్మపేటలోని శక్తికైలాష్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఆర్స్ట్ లో రత్నం సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ ప్రకటన చేసారు. పార్టీతో పొత్తు టిక్కెట్ల కేటాయింపు గురించి జనం ఆలోచించవద్దని, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో పార్టీని ప్రారంభించాలకున్నట్లు స్పష్టం చేసారు.
2026 లో తప్పకుండా పార్టీ పెడతానని ధీమా వ్యక్తం చేసారు. తనను రాజకీయాల్లోకి రానివ్వవద్దని, ప్రజలకు పార్టీలు మంచి చేస్తే సినిమాలో నటించి వెళ్లిపోతానని పొలిటికల్ పార్టీలకు అల్టిమేటం జారీ చేసారు. తమిళనాడులో లోపాలు లేని చోటు లేదని ఎద్దేవా చేసారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని.. పార్టీ జెండాలు చాలా ఉన్నా ఆ జెండాలతో పేద ప్రజలకు మంచి జరగడం లేదన్నారు. రాజకీయాల్లోకి ఎవరోచ్చినా ఏం చేయడం లేదని..ప్రజలు నమ్మి ఓటు వేసినా మోస పోవడంత తప్ప సాధించింది ఏం లేదని ఆవేదన వ్యక్తం చేసారు.
డీఎంకే, ఏఐఏడీఎంకే, ఏ పార్టీ అయినా ప్రజల ప్రాథమిక సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. సామన్య ప్రజలకు ఆరోగ్య సమస్యలోస్తే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తున్నారు. కానీ ఎమ్మెల్యే..ఎంపీలు మాత్రం ప్రయివేట్ ఆసుపత్రికి వెళ్తున్నారు. ఇదెక్కడి న్యాయం? ఇద్దరు సమానం కాదా? ప్రజలు డబ్బుతో ప్రభుత్వ ఆసుపత్రులు ఎంతో నాణ్యతగా ఉండాలి. కానీ ఎలా ఉంటున్నాయో అందరికీ తెలుసన్నారు. ఇందులో సహా ప్రతీ విషయంలో మార్పు రావాలి. ఆ దిశగా ప్రభుత్వాలు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.