విశాల్ ద‌ర్శ‌క‌త్వంలో త‌ల‌పతి విజ‌య్!

మొద‌టి భాగానికి మిస్కిన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ఈసారి ఆ ఛాన్స్ కూడా విశాల్ తీసుకున్నాడు. ఇందులో ఆయ‌నే హీరోగా న‌టిస్తున్నాడు

Update: 2023-09-16 00:30 GMT

కోలీవుడ్ హీరో విశాల్ డిటెక్టివ్ త‌ర్వాత చెప్పుకోద‌గ్గ విజ‌యం ప‌డ‌లేదు. ఈ క్ర‌మంలో రీమేక్ సినిమాలు చేసాడు. కానీ ఏవి విశాల్ రేంజ్ హిట్ ని అందుకోలేదు. అయినా విశాల్ వేగం మాత్రం త‌గ్గ‌లేదు. హీరోగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. అందులోనూ ఎక్కువ‌గా త‌న సొంత బ్యాన‌ర్ విశాల్ ఫిలిం ఫ్యాక్ట‌రీపై నే చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో 'డిటెక్టివ్ -2' చిత్రంతో విశాల్ ద‌ర్శ‌కుడిగానూ ప‌రిచ‌య‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే.

మొద‌టి భాగానికి మిస్కిన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ఈసారి ఆ ఛాన్స్ కూడా విశాల్ తీసుకున్నాడు. ఇందులో ఆయ‌నే హీరోగా న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం సినిమా సెట్స్ లో ఉంది. షూటింగ్ క్లైమాక్స్ వ‌చ్చింది. అలాగే ఇంకా మ‌రికొన్ని సినిమాలు కూడా చేస్తున్నాడు. తాజాగా 'మార్క్ ఆంటోనీ 'ప్ర‌మోష‌న్ లో బిజీగా ఉన్న ఆయ‌న కోలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ విజ‌య్ తో సినిమా ప్ర‌క‌టించారు.

త‌న ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ ఓ సినిమా చేయ‌డానికి చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్లు తెలిపారు. 'విజ‌య్ ని డైరెక్ట్ చేయ‌డం నా డ్రీమ్. అన్ని మంచిగా జ‌రిగితే త్వ‌ర‌లోనే ప్రాజెక్ట్ మొద‌లవుతంది. ఇప్ప‌టికే చ‌ర్చ‌లు జ‌రిగాయి. కొంత కాలం క్రితం విజ‌య్ మేనేజ‌ర్ కి ఫోన్ చేసి విజ‌య్ కి క‌థ చెప్పాల‌నుకుంటున్నా. గంట అపాయింట్ కావాల‌ని అడిగా. దానికి మేనేజ‌ర్ షాక్ అయ్యాడు. కాలేజీ రోజుల నుంచే విజ‌య్ నాకు తెలుసు.

ఆయ‌న న‌టుడిగా ఎంట్రీ ఇచ్చిన కొత్త‌లో ఇలాంటి ముఖాన్ని డ‌బ్బులిచ్చి మ‌రీ థియేట‌ర్ కి వెళ్లి చూస్తారా? ఎవ‌రైనా అని ఓ మ్యాగ‌జైన్ లో రాశారు. ఆ విమ‌ర్శ‌లు ఓ స‌వాల్ గా తీసుకుని విజ‌య్ శ్ర‌మించారు. కొన్నేళ్ల త‌ర్వాత అదే మ్యాగ‌జైన్ లో విజ‌య్ స‌క్సెస్ పుల్ జర్నీ.. హిట్ సినిమాల‌పై ప్ర‌త్యేక క‌థ‌నాలు వ‌చ్చాయి. అదీ విజ‌య్ అంటే. డైరెక్ష‌న్ అంటే నాకెంతో ఇష్టం. అందుకే 'డిటెక్టివ్ -2'ని నేనే డైరెక్ట్ చేస్తున్నా. ఈ అనుభ‌వం విజ‌య్ సినిమాకి బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది అని అన్నారు.

Tags:    

Similar News